ఏపీలోనూ ‘ఓటుకు నోటు’ రాజకీయం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఏపీలోనూ ‘ఓటుకు నోటు’ రాజకీయం

ఏపీలోనూ ‘ఓటుకు నోటు’ రాజకీయం

Written By news on Tuesday, June 16, 2015 | 6/16/2015

చంద్రబాబుపై ధ్వజమెత్తిన
 వైఎస్సార్‌సీపీ
 బలం లేక పోయినా కర్నూలు,
 ప్రకాశంలో టీడీపీ పోటీ
 చంద్రబాబు ప్రభుత్వాన్ని
 బర్తరఫ్ చేయాలి
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతూ అడ్డంగా దొరికిపోయిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే విధంగా ఓటుకు నోటు వ్యవహారాలకు తెరతీస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఏపీ శాసనమండలికి స్థానిక సంస్థల నుంచి జరుగుతున్న ఎన్నికల్లో టీడీపీకి బలం లేకపోయినా కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో అభ్యర్థులను పోటీ చేయిస్తున్నారని విమర్శించారు. మరింత మంది ‘ఆంధ్రా రేవంత్‌రెడ్డి’లను ప్రోత్సహించి వారిద్వారా కోట్లు కుమ్మరించి ఎమ్మెల్సీ స్థానాలను గెలవాలన్నదే చంద్రబాబు ఉద్దేశమని నిప్పులు చెరిగారు.
 
  డబ్బుతో అన్ని వ్యవస్థలనూ దిగజార్చుతున్న చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిలో ఉండటానికి అనర్హుడని... అందుకే కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ జోక్యం చేసుకుని ఆయన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎనిమిదో సెక్షన్ అమలు కోసం ఆరాటపడుతున్న చంద్రబాబు, ప్రత్యేకహోదా విషయంలో ఎందుకు తపన పడటం లేదని సూటిగా ప్రశ్నించారు. మోడీ, చంద్రబాబుకు మద్దతుగా ఎన్నికల్లో ప్రచారం చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓటుకు నోటు వ్యవహారంపై ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.
 
  తెలంగాణలో కేసీఆర్, ఏపీలో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పచ్చి నియంతల్లా వ్యవహరిస్తూ తమకు నచ్చని చానళ్ల ప్రసారాలను ఆపేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఎమర్జెన్సీలో పత్రికలపై సెన్సార్ విధించిన ఇందిరాగాంధీ, ఆమె తనయుడు సంజయ్‌గాంధీ ఆ తరువాతి ఎన్నికల్లో  ఓడిపోయిన విషయం గుర్తుంచుకోవాలన్నారు.
Share this article :

0 comments: