ఘర్షణ పెట్టి ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేయాలని.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఘర్షణ పెట్టి ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేయాలని..

ఘర్షణ పెట్టి ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేయాలని..

Written By news on Tuesday, June 16, 2015 | 6/16/2015


'వంద తప్పులు చేస్తున్నారు'
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి వంద తప్పులు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. మంగళవారం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అంబటి.. చంద్రబాబు తీరును తప్పుబట్టారు. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడాని పదే పదే తప్పులు చేసుకుంటూ వెళుతున్నారన్నారు.

ఏపీ, టీఎస్ పోలీసులకు గొడవ పెట్టాలని చూస్తున్నారని ఈ సందర్భంగా అంబటి పేర్కొన్నారు. ప్రస్తుతం ఘర్షణ పెట్టి ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేయాలని చూస్తున్నారు. ఈ వ్యవహారంలో ఏపీ పోలీసులు రాజ్యాంగానికి సమాధానంగా చెప్పుకోవాల్సిన అవసరాన్ని టీడీపీ నేతలు తీసుకొచ్చారని అంబటి తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలని అంబటి సూచించారు. నోటీసులు తీసుకుని విచారణకు సహకరించాలని చంద్రబాబుకు అంబటి సూచించారు. తమకు భయం లేదంటూనే టీడీపీకి చెందిన ఏడుగురు ముఖ్యనేతలు మీడియాతో మాట్లాడటం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. నేరం చేశారు కాబట్టే భయపడుతున్నారని అంబటి ఎద్దేవా చేశారు. అసలు టీడీపీ నేతలకు హఠాత్తుగా సెక్షన్ -8 ఎందుకు గుర్తొచ్చిందని నిలదీశారు.
Share this article :

0 comments: