పోటీ నుంచి తప్పుకున్నట్టు తప్పుడు ప్రచారం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పోటీ నుంచి తప్పుకున్నట్టు తప్పుడు ప్రచారం

పోటీ నుంచి తప్పుకున్నట్టు తప్పుడు ప్రచారం

Written By news on Tuesday, June 30, 2015 | 6/30/2015

* ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు
 కర్నూలు, ప్రకాశం జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి వైఎస్సార్‌సీపీ వైదొలిగినట్లు తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్న ఏబీఎన్-ఆంధ్రజ్యోతి చానెల్‌పై తక్షణం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సోమవారం ఫిర్యాదు చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఈ మేరకు సీఈఓ భన్వర్‌లాల్‌కు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ భారీగా అవినీతి చర్యలు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డమే కాకుండా తన అనుకూల చానెల్ అయిన ఏబీఎన్ ద్వారా దిగజారిన ప్రచారానికి దిగుతోందని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి విమర్శించారు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు.
Share this article :

0 comments: