అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం

అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం

Written By news on Thursday, June 11, 2015 | 6/11/2015

నల్లగొండ జిల్లా పరామర్శ యాత్రలో షర్మిల భరోసా
♦ రెండోరోజు ఆరు కుటుంబాలను కలసిన వైఎస్ కుమార్తె
♦ ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల్లో పర్యటన
♦ సిరిపురం చేనేత సొసైటీని సందర్శించిన జగన్ సోదరి

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తమపై ఎంతో నమ్మకం పెట్టుకున్న కుటుంబాలను ఆదుకుంటామని.. కష్టాల్లో అండగా ఉంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల భరోసా ఇచ్చారు.

ఏమాత్రం అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు. నల్లగొండ జిల్లాలో  రెండోరోజు బుధవారం ఆమె ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల్లో పర్యటించి ఆరు కుటుంబాలను పరామర్శించారు. ఆయా కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి, వారి పరిస్థితులను తెలుసుకున్నారు. ఈ యాత్రలో భాగంగా మోత్కూరు మండలం పొడిచేడుకు వెళ్లిన షర్మిల.. అక్కడ తెలంగాణ అమరుడు శ్రీకాం తాచారికి పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలసి నివాళులు అర్పించారు.

రామన్నపేట మండలం సిరిపురంలో చేనేత సొసైటీని సందర్శిం చి.. చేనేత ఉత్పత్తులు, కార్మికుల జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గతంలో ఆ గ్రామానికి వైఎస్సార్ వచ్చిన సందర్భాన్ని గ్రామస్తులు షర్మిలకు గుర్తుచేశారు. రెండోరోజు యాత్ర సందర్భంగా షర్మిల వెళ్లిన ప్రతి గ్రామంలోనూ ప్రజలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఆయా కుటుంబాలను పరామర్శిస్తున్నంత సేపు చాలా మంది ప్రజలు వేచి ఉండి.. షర్మిలను కలసి కరచాలనం చేశారు.