తెలంగాణలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరేస్తాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తెలంగాణలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరేస్తాం

తెలంగాణలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరేస్తాం

Written By news on Thursday, June 18, 2015 | 6/18/2015


ప్రజలతో మమేకమైతే విజయం మనదే
టీఆర్‌ఎస్, టీడీపీలు ప్రజా విశ్వాసం కోల్పోయాయి
ఏడాదికాలంలో టీఆర్‌ఎస్ ప్రజలకు చేసిందేమీ లేదు
అవినీతికి పాల్పడిన చంద్రబాబు
సీఎం పదవినుంచి దిగిపోవాలి
మహబూబ్‌నగర్ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి

మహబూబ్‌నగర్ అర్బన్:  టీఆర్‌ఎస్, టీడీపీలు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయాయని, రానున్న కాలంలో తెలంగాణలో అధికార జెండా ఎగురేస్తామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మా మిడి శ్యాంసుందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం మ హబూబ్‌నగర్ పట్టణంలోని రాయల్ ఫంక్షన్‌హాల్‌లో వైఎస్సార్‌సీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా శ్యాంసుందర్‌రెడ్డి మాట్లాడుతూ మహానేత వైఎస్‌ఆ ర్ అర్హత ఉన్న వారందరికీ పింఛన్లు ఇస్తే, కేసీఆర్ ఇంటికొకరికే ఇస్తున్నారని ధ్వజమెత్తారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత వి ద్య, డబుల్ బెడ్‌రూం, ఎస్సీ,ఎస్టీలకు మూడెకరాల చొప్పున భూ పంపిణీ, మహిళలకు వడ్డీలేని రుణాలు, ముస్లింలకు కల్పిస్తామన్న 12శాతం రిజర్వేషన్ల అమలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.

కల్లబొల్లి కబుర్లతో కాలయాపన చేయడం మినహా ఏడాది కాలంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకం అంటూ జిల్లా ప్రజలను మోసం చేయకుండా వైఎస్ ప్రారంభించిన కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయల్‌సాగర్, భీమా ప్రాజెక్టులను పూర్తి చేసి రబీ నాటికి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. పంటరుణాల కోసం రుణపరిమితిని ఎకరానికి రూ.50 వేలకు పెంచాలని, పూర్తిగా రుణాలు మాఫీ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. ఎమ్మెల్యేలను కొంటూ డబ్బులతో సహా పట్టుబడిన టీడీపీ  దొంగల పార్టీయని, అవినీతికి పాల్పడిన చంద్రబాబు నాయుడు వెంటనే సీఎం పదవి నుంచి దిగి పోవాలని డిమాండ్ చేశారు. వైఎస్ పథకాలే పార్టీకి శ్రీరామ రక్షయని, ప్రజల ఎదుట కాలర్ ఎగురేసుకుంటూ తిరిగే హక్కు తమకే ఉందన్నారు. ఆగస్టు మాసాంతానికి గ్రామకమిటీలు పూర్తి చేయాలని నూతన మండలాధ్యక్షులకు సూచించారు.

సేవాభావంతో పని చేయాలి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కుటుంబానికి జిల్లాలో ప్రత్యేకమైన ఆదరణ ఉందని, పార్టీ శ్రేణులు సేవాభావంతో పనిచేసి ప్రజల అవపరాలు తీర్చాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రైతు విభాగం రాష్ర్ట అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి పిలుపునిచ్చారు. షర్మిలమ్మ జిల్లాలో చేసిన పాదయాత్ర, పరామర్శ యాత్రలను విజయవంతం చేసిన ఘనత పార్టీ కార్యకర్తలకే దక్కిందన్నారు. నదీ జలాలను జిల్లాకిచ్చిన తర్వాతే ఇతర ప్రాంతాలకు తరలించాలని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి సాగునీరందించాలని డిమాండ్ చేశారు. సొంత మామ ఎన్‌టీఆర్‌ను అధర్మంగా గద్దెదించిన చంద్రబాబునకు ఆయన ఉసురు తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు జైలుకు పోతేనే వర్షాలు పడతాయని ప్రజలు అనుకుంటున్నారన్నారు. ఏపీలో జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా సమర్థవంతంగా పని చేస్తున్నారని, ప్రజలకోసం కష్టపడుతున్న జగనన్న తప్పకుండా సీఎం అవుతారన్నారు. తెలంగాణలో ఉన్న ఓటు బ్యాంకు ను చూసి ఇతర పార్టీలు వైఎస్సార్‌సీపీతో పొత్తుకోసం ఎదురుచూస్తున్నాయన్నారు. - ఎడ్మ కిష్టారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి

సమావేశంలో తీర్మానాలు
 
  • గతరబీ సీజన్‌లో అకాల వర్షాలు,ఈదురు గాలులకు పంటలు, పండ్ల తోటలు నష్ట పో యిన రైతులకు పరిహారంతో పాటు ఉచి తంగా విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలి.
  • వైఎస్సార్ జిల్లాలో ప్రారంభించిన నాలుగు ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలి.
  • తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక పోషించిన నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వాలి.
  • జనాభాలో సగం భాగం ఉన్న మహిళలకు మంత్రి వర్గంలో చోటు కల్పించాలి.
  • అప్పులు పెరిగి ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి.
  • శ్రీశైలం ప్రాజెక్టు కుటుంబాల్లో 98 జీఓం ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలి.
  • 1998 డీఎస్‌సీ అభ్యర్థులకు టీచర్ల నియామకాలు చేపట్టాలి.
Share this article :

0 comments: