బలరాం గౌడ్ కుటుంబానికి పరామర్శ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బలరాం గౌడ్ కుటుంబానికి పరామర్శ

బలరాం గౌడ్ కుటుంబానికి పరామర్శ

Written By news on Tuesday, June 9, 2015 | 6/09/2015


బలరాం గౌడ్ కుటుంబానికి పరామర్శ
నల్లగొండ: తొలిరోజు పరామర్శ యాత్రలో భాగంగా బీబీనగర్ మండలం పడమటి సోమారంలో బలరాం గౌడ్ కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శించారు. అలాగే, వలిగొండ మండలం కంచనపల్లిలో కొలిచెలిమి అంజయ్య కుటుంబాన్ని, భువనగిరి మండలం ముత్యాలపల్లిలో కళ్లెం నర్సయ్య కుటుంబాన్ని, యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లిలో చింత కృష్ణ కుటుంబాన్ని, దాతురపల్లిలో చంద్రమ్మ కుటుంబాన్ని షర్మిల పరామర్శించనున్నారు. తెలంగాణలో వైఎస్ షర్మిల రెండో దఫా పరామర్శ యాత్ర మంగళవారం మొదలైంది.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలినవారి కుటుంబాలను పరామర్శించేందుకు ఆమె ఈ యాత్ర ప్రారంభించారు. అందులో భాగంగా తొలుత బీబీనగర్ టోల్ ప్లాజా వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మొత్తం నాలుగు రోజుల పాటు జరిగే ఈ యాత్రలో 18 కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్, నల్లగొండ, మునుగోడులలో ఆమె పరామర్శ యాత్ర కొనసాగనుంది.
Share this article :

0 comments: