పార్టీ మారే యోచన లేదు: ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పార్టీ మారే యోచన లేదు: ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ

పార్టీ మారే యోచన లేదు: ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ

Written By news on Tuesday, June 30, 2015 | 6/30/2015

హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీకి నష్టం కలిగించే పని ఎప్పుడూ చేయనని, పార్టీ మారే ఆలోచన తనకు లేదని ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు స్పష్టం చేశారు. మంగళవారం విజయనగరం జిల్లా వైఎస్ఆర్ సీపీ నేతలు..  పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. వైస్ జగన్ ను కలిసిన వారిలో సుజయ్ కృష్ణతో పాటు పుష్పశ్రీవాణి, రాజన్నదొర, కోలగట్ల వీరభద్రస్వామి, పెన్మత్స సాంబశివరాజు తదితరులు ఉన్నారు.

సుజయ్ కృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్టు చెప్పారు. తాను టీడీపీ నేతలతో ఎప్పుడూ సంప్రదింపులు జరపలేదని వెల్లడించారు. తాను పార్టీ మారబోతున్నట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని అన్నారు. పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ సీపీలో చేరినపుడు వ్యక్తిగత కారణాల వల్ల హాజరుకాలేకపోయానని సుజయ్ కృష్ణ తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్టు ప్రతిపాదిత గ్రామాల్లో సెక్షన్ 30 అమలుపై వైఎస్ జగన్ తో చర్చించినట్టు ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి చెప్పారు.
Share this article :

0 comments: