బాస్ ఆ గొంతు నీది కాదని చెప్పే ధైర్యం ఉందా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాస్ ఆ గొంతు నీది కాదని చెప్పే ధైర్యం ఉందా?

బాస్ ఆ గొంతు నీది కాదని చెప్పే ధైర్యం ఉందా?

Written By news on Thursday, June 18, 2015 | 6/18/2015

వైఎస్ వివేకానందరెడ్డి
 
 రైల్వేకోడూరు రూరల్ : ఓటుకు నోటు వ్యవహారంతో ఫోన్‌లోని స్వరం తనది కాదని చెప్పే దమ్ము సీఎం చంద్రబాబుకు ఉందా అని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకుడు వైఎస్ వివేకానందరెడ్డి సూటిగా ప్రశ్నించారు.  రైల్వేకోడూరులోని వైఎస్‌ఆర్ అతిథి గృహంలో బుధవారం సాయంత్రం ఆయన ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులుతో కలిసి విలేకర్లతో మాట్లాడారు.  తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు.

రాజధాని నిర్మాణం పేరిట విదేశీయాత్రలు చేయడం మినహా ప్రజల బాగోగులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఏపీ పరువును తెలంగాణ లో తీస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి నాయకుడినా మనం ఎన్నుకున్నదని ప్రజలు సిగ్గుపడుతున్నారన్నారు. అయితే ఆ పార్టీ బాస్‌తో తోపాటు నాయకులకు చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. వర్షాలు లేక, పంటలు పండక, తాగేందుకు నీళ్లు లేక ప్రజలు అవస్థలు పడుతుంటే ప్రభుత్వానికి ఏమాత్రం స్పందనలేదన్నారు. ప్రభుత్వం ఉందా లేదా అనే భావన ప్రజలకు ఏర్పడిందన్నారు.

ఈ సమావేశంలో జెడ్పీటీసీ సభ్యురాలు మారెళ్ల రాజేశ్వరి, వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి బండారు సుభద్రమ్మ, పట్టణ కన్వీనర్ సీహెచ్ రమేష్, క్షత్రియ నాయకులు క్రిష్ణమరాజు, జనార్ధన్‌రాజు, నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎం.నాగేంద్ర, ఎంపీటీసీ సభ్యులు రవికుమార్, సుధాకర్‌రాజు, పార్టీ నాయకులు హరిక్రిష్ణారెడ్డి, పద్మనాభరెడ్డి, నాగేంద్రరాజు, గంగయ్య, రమేష్ పాల్గొన్నారు.
Share this article :

0 comments: