ఎంపీటీసీలను లాడ్జీలో పట్టుకున్న వైఎస్సార్ సీపీ నేతలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎంపీటీసీలను లాడ్జీలో పట్టుకున్న వైఎస్సార్ సీపీ నేతలు

ఎంపీటీసీలను లాడ్జీలో పట్టుకున్న వైఎస్సార్ సీపీ నేతలు

Written By news on Tuesday, June 23, 2015 | 6/23/2015

ప్రకాశం: స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అధికార పార్టీ నేతలు ప్రలోభాలకు పాల్పడుతున్నారు. ఈ ఎన్నికల నేపథ్యంలో నెల్లూరులోని ఓ లాడ్జీలో ప్రకాశం జిల్లా ఎంపీటీసీలను దాచేశారు. దీన్ని గుర్తించిన వైఎస్ ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి, శ్రీధర్ రెడ్డిలు తమ అనుచరులతో కలిసివెళ్లి ఎంపీటీసీలను పక్కగా పట్టుకున్నారు. టీడీపీ నేతలు తమను కొనగోలు చేశారంటూ ఎంపీటీసీలు వెల్లడించారు. అంతేకాక తమకు 50 వేల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినట్టుగా ఎంపీటీసీలు చెప్పారు.

అలాగే ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినట్టుగా తెలిపారు. టీడీపీ నేతల ఎంపీటీసీలను ప్రలోభాలకు గురిచేయడంపై వైసీఆర్ సీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో నెల్లూరు నగర పోలీసులకు వైఎస్ ఆర్ సీపీ నేతలకు మధ్య వాదోపవాదనలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే ఓటుకు కోట్ల కేసు నడుస్తున్నా టీడీపీ నేతల బుద్ధి మారలేదని వైఎస్ ఆర్ సీపీ నేతలు మండిపడ్డారు.
Share this article :

0 comments: