వారంతా తొత్తులే.. కోర్టుకు ఈడుస్తాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వారంతా తొత్తులే.. కోర్టుకు ఈడుస్తాం

వారంతా తొత్తులే.. కోర్టుకు ఈడుస్తాం

Written By news on Monday, June 8, 2015 | 6/08/2015


వారంతా తొత్తులే.. కోర్టుకు ఈడుస్తాం
మంగళగిరి: ప్రకాశం బ్యారేజీ భద్రతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాలికొదిలేసిందని మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే మండిపడ్డారు. 2002 నుంచే బ్యారేజీ భద్రత దృష్ట్యా భారీ వాహనాలు నిలిపివేయగా ఇప్పుడు మాత్రం టీడీపీ నేతలు ఆ విషయాన్ని పట్టించుకోకుండా అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నారన్నారు. సోమవారం సాయంత్రం జరుగుతున్న మహా సంకల్ప సభకు టీడీపీ కార్యకర్తలు భారీ వాహనాలతో తరలి వచ్చారు. ఆ వాహనాలను ప్రకాశం బ్యారేజీ మీదుగా పంపించారు.

దీంతో విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ ఇన్నాళ్లుగా భారీ వాహనాలకు నిషేధం విదించగా ఇప్పుడు సభ కోసమని ఎలా అనుమతిస్తారని నిలదీశారు. లారీలు, బస్సులు బ్యారేజీ మీద నుంచి పంపించడానికి వీలు లేదని చెప్పారు. టీడీపీ నేతలకు అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, వారందరినీ కోర్టుకు ఈడుస్తామని చెప్పారు.
Share this article :

0 comments: