బాబు అసలు రంగు బయటపడింది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు అసలు రంగు బయటపడింది

బాబు అసలు రంగు బయటపడింది

Written By news on Thursday, June 18, 2015 | 6/18/2015


ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
పులివెందుల : ‘ఓటుకు నోటు’ వ్యవహారంతో బాబు అసలు రంగు బయటపడిందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. బుధవారం బాకరాపురంలోని స్థానిక వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ‘ఓటుకు నోటు’వ్యవహారంలో అనేకమంది టీడీపీ నేతలు హస్తమున్నట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ఎమ్మెల్యేలను డబ్బుతో కొనడం చంద్రబాబుకు కొత్తేమీ కాదని ఆరోపించారు. గతంలో తన మామ ఎన్‌టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి దొడ్డిదారిన సీఎం పదవిని చేజిక్కించుకున్నారని విమర్శించారు.

స్టీఫెన్ సన్‌తో ఫోన్ సంభాషణలపై విచారణ సిద్ధమై తన నిజాయితీని నిరూపించుకోకుండా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎదురుదాడి చేయడం తగదన్నారు.అడ్డంగా దొరికిపోయిన దేశం నేతలు ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో గవర్నర్‌ను కూడా దుర్భాషలాడటం దారుణమైన విషయమన్నారు. ప్రస్తుతం ఆంధ్రాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేలను  డబ్బుతో వ్యవహారాలు నడపాలని బాబు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

ఇంతటి అవినీతి చరిత్ర ఉన్న చంద్రబాబు తాను నిప్పు అని ప్రగల్భాలు మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు వ్యవహారాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని త్వర లో ఆయనకు ప్రజలే తగిన రీతిలో జవాబు చెప్పే రోజు వస్తుందని జోస్యం పలికారు.

 ప్రజా సమస్యలపై ప్రజా దర్బార్:
 బుధవారం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు  సమస్యలను విని పరిష్కారానికి కృషి చేశారు. పులివెందుల మున్సిపల్ కమిషనర్ విజయసింహారెడ్డితోపాటు మున్సిపాలిటీలోని పలు సమస్యలపై ఆయన చర్చించారు. ప్రజల కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు సూచించారు. వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చెర్మైన్ చిన్నప్ప, కౌన్సిలర్లు,  వేల్పుల రాము, మల్లికేశవరెడ్డి, బలపనూరు శేఖరరెడ్డిలు, హాలు గంగాధరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: