సురేష్ ప్రభుతో వైఎస్ జగన్ భేటీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సురేష్ ప్రభుతో వైఎస్ జగన్ భేటీ

సురేష్ ప్రభుతో వైఎస్ జగన్ భేటీ

Written By news on Wednesday, June 10, 2015 | 6/10/2015


సురేష్ ప్రభుతో వైఎస్ జగన్ భేటీ
న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరిన్నీ రైళ్లు కేటాయించాలని సురేష్ ప్రభుకు ఈ సందర్భంగా వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ భేటీలో  వైఎస్ జగన్ వెంట ఆ పార్టీ ఎంపీలు కూడా  ఉన్నారు.

ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఏ 1గా చేర్చాలని వైఎస్ జగన్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ అంశంపై ఢిల్లీ పర్యటనలో ఉన్న వైఎస్ జగన్ ఇప్పటికే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలసి విజ్ఞప్తి చేసిన విషయం విదితమే.
Share this article :

0 comments: