నాలుగు రోజులపాటు సాగనున్న యాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నాలుగు రోజులపాటు సాగనున్న యాత్ర

నాలుగు రోజులపాటు సాగనున్న యాత్ర

Written By news on Tuesday, June 9, 2015 | 6/09/2015


నేడు జిల్లాకు రాజన్న బిడ్డ
 బీబీనగర్ మండలం నుంచి ప్రారంభం
 టోల్‌గేట్ వద్ద వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్న వైఎస్ షర్మిల
 నాలుగు రోజులపాటు సాగనున్న యాత్ర
 18 కుటుంబాలకు ఓదార్పు


 భువనగిరి : తన తండ్రి మరణం తట్టుకోలేక జిల్లాలో గుండెపగిలి మృతిచెందిన వారి కుటుంబాల్లో మనోస్థైర్యం కల్పించేందుకు రాజన్న బిడ్డ షర్మిల మలివిడత పరామర్శ యాత్ర మంగళవారంనుంచి ప్రారంభంకానుంది. 6 నియోజకవర్గాల్లో 18 మంది కుటుంబాలను కలుసుకుని వారి బాగోగులు తెలుసుకోనున్నారు. వారికి తమ కుటుం బం అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక జిల్లాలో మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మలి విడత పరామర్శ యాత్ర మంగళవారం నల్లగొండ జిల్లాలో ప్రారంభం కానుంది.

 భువనగిరి నియోజకవర్గం బీబీనగర్ మండలంలోని గూడూరు టోల్‌గేట్ వద్ద వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం యాత్ర ప్రారంభమవుతుంది. ఈ నెల 12వ తేదీన మునుగోడు నియోజవర్గం చౌటుప్పల్‌లో ముగుస్తుంది. భువనగిరి, అలేరు. తుంగతుర్తి, నకిరేకల్, నల్లగొండ, మునుగోడు నియోజవర్గాల్లో 18 కుటుం బాలను షర్మిల పరామర్శిస్తారు. వైఎస్సార్ మరణం తట్టుకోలేక జిల్లాలో 49 మంది చనిపోయారు. అందులో 32 కుంటుంబాలను గతంలోనే ఆమె పరామర్శించిన విషయం తెలిసిందే.

 షర్మిల పరామర్శ యాత్ర తొలిరోజు షెడ్యూల్..
 ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌నుంచి బయలుదేరుతారు. బీబీనగర్ మండలం గూడూరు టోల్ గేట్ వద్దగల వైఎస్ విగ్రహానికి పూల మాల వేసి అక్కడినుంచి పరామర్శయాత్రకు వెళతారు. తొలిరోజు బీబీనగర్ మండలం వెంకిర్యాలలో గల చెర్కు కిష్టయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడినుంచి వలిగొండ మండలం కంచనపల్లికి వెళ్లి కొలిచెల్మి అంజయ్య కుటుంబాన్ని, భువనగిరి మండలం ముస్త్యాలపల్లికి చెందిన కల్లెం నర్సయ్య కుటుంబాలను పరామర్శిస్తారు. ఇక్కడితో మూడు కుటుంబాల పరామర్శ పూర్తవుతుంది. ఇక్కడితో భువనగిరి నియోజకవర్గం యాత్ర పూర్తవుతుంది. ఆనంతరం ఆలేరు నియోజకవర్గం యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లి గ్రామంలో ఎ.చంద్రమ్మ, యాదగిరిపల్లిలో చింతల కృష్ణ కుటుంబాలను పరామర్శిస్తారు. ఆలేరులో రాత్రి బస చేస్తారు.
 మలివిడత పరామర్శ యాత్రలో కలిసే కుటుంబాలు..

 భువనగిరి నియోజకవర్గంలో
 బీబీనగర్ మండలం వెకిర్యాల గ్రామానికి చెందిన చెర్కు కిష్టయ్యగౌడ్ కుటుంబ ం
 వలిగొండ మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన కొలిచెల్మి అంజయ్య కుటుంబం
 భువనగిరి మండలం ముస్త్యాలపల్లి గ్రామానికి చెందిన కళ్లెం నర్సయ్య కుటుంబ ం  
 ఆలేరు నియోజకవర్గంలో
 ఆలేరు మండలం శారాజీపేట గ్రామానికి చెందిన  ఎదుల్ల శ్రీనివాస్ కుటుంబం
 యాదగిరిగుట్ట మండలంలోని యాదగిరిపల్లి గ్రామానికి చెందిన చింతల కృష్ణ కుటుంబ ం
 యాదగిరిగుట్ట మండలంలోని దాతరుపల్లి గ్రామానికి చెందిన ఎ.చంద్రమ్మ కుటుంబం
 తుంగతుర్తి  నియోజకవర్గంలో
 మోత్కూర్ మండలం పొడిచేడు గ్రామానికి చెందిన బీతి నర్సమ్మ కుటుంబం
 నకిరేకల్ నియోజకవర్గంలో
 రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన పున్న వీరయ్య కుటుంబం
 కట్టంగూరు మండలంలోని కేంద్రం గ్రామానికి చెందిన గాదగోని రాములు కుటుంబం
 నకిరేకల్ మండలంలోని మర్రూర్ గ్రామానికి చెందిన పుట్ట సైదులు
 నెమ్మాది శేఖర్ కుటుంబం
 నల్లగొండ నియోజకవర్గంలో
 నల్లగొండ మండలం చందనపల్లి గ్రామానికి చెందిన చింతా భిక్షమయ్య కుటుంబం
 తిప్పర్తి మండలం కేంద్రానికి చెందిన గుంటి వెంకటేశం కుటుంబం
 తిప్పర్తి మండలం ఇందుగుల గ్రామానికి చెందిన రాయించు నర్సింహ కుటుంబం
 నల్లగొండ పట్టణంలో దండేకార్ దయానంద్ కుటుంబం
 మునుగోడు నియోజకవర్గంలో
 మర్రిగూడెం మండలం తాన్‌దార్‌పల్లి గ్రామానికి చెందిన మునగాల పుల్లమ్మ కుటుంబ ం
 నాంపల్లి  మండలం నాంపల్లికి చెందిన  అస్తర్‌బీ కుటుంబం
 చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన బిట్ర వసంతరావు  కుటుంబ ం.

 పరామర్శ యాత్ర తొలిరోజు షెడ్యూల్..
 మొదట గూడూరు టోల్‌గేట్ వద్దగల వైఎస్ విగ్రహానికి పూలమాల వేస్తారు.
  బీబీనగర్ మండలం వెంకిర్యాలలో చెర్కు కిష్టయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు.
  వలిగొండ మండలం కంచనపల్లిలో కొలిచెల్మి అంజయ్య కుటుంబాన్ని కలుసుకుంటారు.
  భువనగిరి మండలం ముస్త్యాలపల్లికి చెందిన నర్సయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు.
  యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లిలో ఎ.చంద్రమ్మ, యాదగిరిపల్లిలో చింతల కృష్ణ కుటుంబాలను పరామర్శిస్తారు.
Share this article :

0 comments: