మోదీని ఇంగ్లిష్‌లో తిట్టరెందుకు బాబూ..! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మోదీని ఇంగ్లిష్‌లో తిట్టరెందుకు బాబూ..!

మోదీని ఇంగ్లిష్‌లో తిట్టరెందుకు బాబూ..!

Written By news on Friday, June 5, 2015 | 6/05/2015


కొట్టుకుపోతారు
సమరదీక్ష ముగింపు సభలో చంద్రబాబుపై విరుచుకుపడ్డ వైఎస్ జగన్
♦ ఎన్నికలొస్తే చంద్రబాబుకు డిపాజిట్లు కూడా దక్కవు
♦ రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, పదేళ్ల ప్రత్యేకహోదా... అప్పట్లో అన్ని టీవీల్లోనూ ఇవే మాటలు
♦ ఈ హామీలన్నీ సమైక్య రాష్ట్రంలో ఇచ్చానని, ఇప్పుడు అమలు సాధ్యం కాదంటున్నారు
♦ అన్నీ అబద్ధాలు... రాష్ట్రాన్ని విడగొట్టాకే ఏపీ, తెలంగాణకు రెండు మేనిఫెస్టోలు విడుదల చేశారు
♦ ఇవ్వాళ భద్రతా సిబ్బంది లేకుండా గ్రామాల్లో తిరిగితే రాళ్లతో కొడతారు

♦ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి లంచమిస్తూ అడ్డంగా దొరికిపోయారు
♦ ఈయనేమో విజయవాడ వచ్చి అవినీతిరహిత రాజ్యం కావాలంటూ ప్రమాణం చేయిస్తారు.. ఇంతకన్నా సిగ్గుమాలిన నాయకుడు ఎవరైనా ఉంటారా?
♦ ప్రత్యేక హోదాపై ఢిల్లీతో పోరాడాలంటే బాబుకు భయం
♦ చంద్రబాబు మెడలు వంచైనా సరే హామీలన్నీ నెరవేర్చేలా చేస్తాం
♦ అప్పటివరకూ ఆయనను నిద్రపోనివ్వం

 
సమరదీక్ష ప్రాంగణం నుంచి  సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో ఈసారి ఎన్నికలొస్తే చంద్రబాబుకు డిపాజిట్లు కూడా దక్కవని, ప్రజల గుండెల్లో నుంచి వచ్చే కోపాగ్ని కెరటం ఉవ్వెత్తున ఎగసి ఆయనను బంగాళాఖాతంలో కలుపుతుందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విరుచుకుపడ్డారు. బాబు నయవంచనకు నిరసనగా మంగళగిరి ‘వై’ జంక్షన్ వద్ద రెండు రోజులపాటు సమరదీక్ష (నిరాహారదీక్ష) చేసిన జగన్ గురువారం తన దీక్షను విరమించారు.

భారీగా హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను, గద్దెనెక్కిన తరువాత ఏరకంగా తుంగలో తొక్కారో ప్రజలందరూ చూస్తున్నారని... వారే బాబుకు గట్టిగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఎన్నికలొస్తే ప్రజల గుండెల్లో ఒక కదలిక వచ్చి... అది కెరటంగా మారి చంద్రబాబును బంగాళాఖాతంలో కలపడం ఖాయమన్నారు. జగన్ ఇంకా ఏం చెప్పారంటే...
 
⇒ చంద్రబాబు ఏడాది కిందట ఏం చెప్పారు?
చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చనందుకు నిరసనగా తణుకులో రెండు రోజులపాటు నిరాహారదీక్ష చేశాను. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద భారీ ఎత్తున ధర్నాలు చేశాం. విశాఖలో జరిగిన ధర్నాలో నేనే స్వయంగా పాల్గొన్నా. ఇప్పుడు చంద్రబాబు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా మంగళగిరిలో ప్రధానంగా ఐదు అంశాలపై రెండు రోజుల పాటు నిరాహారదీక్ష చేశాం.

ఆ రోజుకూ, ఈ రోజుకూ చంద్రబాబు మనసులో వచ్చిన మార్పేమిటి? అనే విషయాలను ఒకసారి మనమంతా తెలుసుకోవాలి. ఒక్కసారి ఏడాది కిందకు వెళదాం. ఆరోజు చంద్రబాబు ఓట్ల కోసం ఏం చెప్పారో మీ ముందున్న పెద్ద టీవీల్లో ఒక్కసారి చూడండి. (అప్పట్లో చంద్రబాబు ఎన్నికల సభల్లో మాట్లాడిన వీడియో దృశ్యాలను సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్క్రీన్‌లపై ప్రదర్శించారు. ఈ ప్రదర్శన ముగిశాక జగన్  ప్రసంగాన్ని కొనసాగించారు.)
 
⇒ గ్రామాల్లో తిరిగితే ప్రజలు రాళ్లతో కొడతారు
ఎన్నికల సమయంలో ఏ టీవీ పెట్టినా... జాబు కావాలంటే బాబు రావాలనే మాటలే వినిపించేవి. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలనే ప్రకటనలు కనిపించేవి. రైతుల మొహంలో చిరునవ్వు కనిపించాలంటే, వారి రుణాలు మాఫీ కావాలంటే బాబు రావాలనే మాట వినిపించేది. ప్రత్యేక హోదా పదేళ్లేం ఖర్మ, పదిహేనేళ్లు కావాలని ఎన్నికల ముందు చెప్పారు. ఎన్నికలైపోయి ఇవాల్టికి సంవత్సరం దాటిన తరువాత చంద్రబాబు నోటి నుంచి వస్తున్న మాటలు వేరుగా ఉన్నాయి.

తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడు ఈ హామీలన్నీ సమైక్య రాష్ట్రంగా ఉన్నపుడు ఇచ్చినవని, ఇప్పుడు అమలు చేయడం తనవల్ల కాదని చెప్పారట. ఆయన చెబుతున్నవన్నీ అబద్ధాలే. రాష్ట్రాన్ని విడగొట్టిన తరువాతనే ఆయన ఈ హామీలు ఇచ్చారు. తెలంగాణకు, సీమాంధ్రకు వేర్వేరుగా ఎన్నికల మేనిఫెస్టోలు విడుదల చేశారు. ఈ హామీలు ఎలా నెరవేరుస్తారని ఎన్నికల కమిషన్ అడిగితే... తనకు రాష్ట్ర ఆర్థిక వనరులపై పూర్తి అవగాహన ఉందనీ, ప్రతి హామీని నెరవేరుస్తానని లేఖ రాశారు.

ఇపుడు ఎన్నికలైపోయాయి కనుక ప్రజలతో నాకేం పని? రైతులతో నాకేం పని? చేనేత కార్మికులతో నాకేం పని? నిరుద్యోగులతో నాకేం పని? అనుకుంటూ ప్లేటు మార్చారు. ఒక అబద్ధాన్ని కప్పి పుచ్చుకోవడానికి రోజుకో అబద్ధం ఆడుతున్నారు. ప్రతిరోజూ అబద్ధాలు చెప్పడం, ఆరోపణలుచేయడం ఆయనకు అలవాటైపోయింది. ఎన్నాళ్లు బతికామనేది ముఖ్యంకాదు, ఎలా బతికామన్నది ముఖ్యమని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పేవారు. చంద్రబాబును చూస్తుంటే నిజంగా రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులున్నారా? అని సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోంది. ఇవ్వాళ చంద్రబాబు తన భద్రతా సిబ్బందిని పక్కన బెట్టి గ్రామాల్లో తిరిగితే ప్రజలంతా రాళ్లతో కొడతారు.
 
⇒ ఆయనకన్నా సిగ్గుమాలిన వారుంటారా?
మొన్నటికి మొన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తెలంగాణలో చంద్రబాబు తరపున ఐదు కోట్ల రూపాయలు లంచంగా ఇస్తూ పట్టుబడిన దృశ్యాలను అంతా టీవీల్లో చూసే ఉంటారు. రేవంత్‌రెడ్డి లంచం ఇచ్చేటపుడు... మా బాస్‌తో మాట్లాడిస్తానని చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడించారు. ఈ ఐదు కోట్ల రూపాయలు సరిపోకపోతే ఇంకా ఎక్కువ అడిగినా మా బాస్ ఇస్తార ని చెప్పాడు. తెలంగాణలో ఒక ఎమ్మెల్సీని గెలిపించుకోవడంకోసం... ఒక ఎమ్మెల్యేను కొనడానికి ఐదు కోట్ల నగదుతో సిద్ధమయ్యారు.

ఒక్క ఎమ్మెల్సీ గెలవాలంటే 18 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం అవుతాయి. అంటే అంతమంది ఎమ్మెల్యేలను కొనడానికి రూ.90 కోట్లు కావాలి. అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు చంద్రబాబూ? ఒకవైపు రేవంత్‌రెడ్డి అడ్డంగా దొరికిపోయి చంద్రబాబు బట్టలు విప్పేస్తుంటే... విజయవాడకు వచ్చిన చంద్రబాబు అక్కడ చదువుకున్న పిల్లలతోసహా వాళ్లనూ, వీళ్లనూ పోగేసి అవినీతి లేని రాజ్యం కావాలంటూ ప్రమాణం చేయించడం విడ్డూరంగా ఉంది. నిండా అవినీతిలో మునిగిన చంద్రబాబు అవినీతిరహిత రాష్ట్రం కావాలని ప్రమాణం చేయిస్తున్నారంటే ఆయనకన్నా సిగ్గుమాలిన వారుంటారా?

⇒ మోదీని ఇంగ్లిష్‌లో తిట్టరెందుకు బాబూ..!
గత సంవత్సర కాలంలో ప్రజలను ఇబ్బందులు పెట్టడం తప్ప చంద్రబాబునాయుడు రాష్ట్రానికి చేసిందేమీలేదు. కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేసి కనీసం ప్రత్యేక హోదా అయినా తీసుకురావాలని ఎన్నిసార్లు తిట్టినా ప్రయోజనం లేకపోయింది. ఢిల్లీ వాళ్లు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలేదని నసుగుతాడేతప్ప... ఢిల్లీ వాళ్లను ఇంగ్లిష్‌లో గాని, హిందీలో గాని తిట్టనే తిట్టడు. ఇంగ్లీషులో తిడితే... మోదీకి వినిపిస్తే... తనను ఇబ్బందులు పెడతాడని ఆయనకు భయం.

ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు. ప్రత్యేక హోదా వస్తే కేంద్రం నుంచి మనకు వచ్చే వనరుల్లో గ్రాంట్లు పెరుగుతాయి. కేంద్రం నుంచి పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలకు ఆదాయపుపన్ను రాయితీలు లభిస్తాయి. కార్పొరేట్ పన్ను రాయితీ వస్తుంది. ఎక్సైజ్ డ్యూటీలో రాయితీలు ఇస్తారు. దానివల్ల పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి పరిశ్రమలు వస్తాయి. రాష్ట్రం బాగుపడుతుంది. చంద్రబాబుకు ఇవన్నీ తెలిసినా కానీ ప్రత్యేక హోదా కోసం గట్టిగా పోరాటమే చేయడు. ఆయనకు సంబంధించిన ఇద్దరు మంత్రులు మాత్రం కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతూనే ఉంటారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వనపుడు నీ ఇద్దరు మంత్రులను కేంద్రంలో ఎందుకు కొనసాగిస్తున్నావు చంద్రబాబూ?

⇒ రైతుల భూములు వెనక్కు ఇచ్చేస్తాం
రాజధాని పేరుతో రైతులకు ఇష్టమున్నా లేకపోయినా బలవంతంగా భూములు లాక్కుంటున్నాడు. అయ్యా చంద్రబాబూ... హైదరాబాద్‌లో ఉన్న నీ భూమిని, నీ స్థలాలను ఎవరైనా లాక్కుంటే నీకెలా ఉంటుంది? హైదరాబాద్‌లో ఉన్న ఆయన ఇల్లు, స్థలాలకు ఏమీ కాకూడదు. కానీ ఇక్కడ రైతులకు ఇష్టం లేకపోయినా మూడు పంటలు పండించే భూములను లాక్కుంటారు. ఈ మాదిరిగా చేసే పరిపాలన ఎక్కువ రోజులు సాగదు. చంద్రబాబు ఆ పదవిలో రెండేళ్లుంటారో, మూడేళ్లుంటారో నాకైతే తెలియదు కానీ, మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే. చంద్రబాబు బలవంతంగా లాక్కున్న భూములన్నింటినీ అప్పుడు రైతులకు తిరిగి వెనక్కు ఇచ్చేస్తాం.
    
⇒ హామీలు నెరవేర్చేవరకూ నిద్రపోనివ్వం
చంద్రబాబు ఆరోజు ప్రజల చెవుల్లో క్యాలీఫ్లవర్లు పెట్టి మోసం చేసి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. గద్దెనెక్కాక రైతుల గురించి పట్టించుకోవడంలేదు, చేనేత కార్మికులను ఆదుకునే పరిస్థితిలేదు, చదువుకున్న పిల్లలను కూడా పట్టించుకోవడం లేదు. చదువుకున్న పిల్లల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సంవత్సరం దాటినా పిల్లల చదువులకు సంబంధించిన ఫీజు బకాయిలను చంద్రబాబు ఇంతవరకూ కట్టలేదు.

ఇక్కడికి రావడానికి ముందు ఒక ఇంజినీరింగ్ కళాశాల యజమానితో మాట్లాడా... ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వచ్చాయా? అని అడిగా. విద్యాసంవత్సరం పూర్తయినా తమకు రావాల్సిన రూ. 4.15 కోట్లు రాలేదని చెప్పారు. పిల్లలు సర్టిఫికెట్లకోసం వస్తే... ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామనే పరిస్థితి నెలకొని ఉందన్నాడు. ఇలా అన్ని వర్గాలనూ బాధిస్తున్న చంద్రబాబును ఊరికే వదలబోం. ఆయన మెడలు వంచైనా సరే ఎన్నికలపుడు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే పరిస్థితిని తీసుకుని వస్తాం. అప్పటివరకూ నిద్రపోనివ్వం.

⇒ సమరదీక్షకు హాజరైన ఎంపీలు, ఎమ్మెల్యేలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల పాటు చేపట్టిన సమరదీక్ష ముగింపు సందర్బంగా గురువారం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భారీగా తరలివచ్చారు. ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆళ్లరామకృష్ణారెడ్డి(ఆర్కే), జ్యోతుల నెహ్రూ, భూమా నాగిరెడ్డి, పి.రవీంద్రనాథ్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మొహహ్మద్ ముస్తఫా, కోన రఘుపతి, ఉప్పులేటి కల్పన, కొడాలి నాని, జలీల్‌ఖాన్, మేకా ప్రతాప్ వెంకట అప్పారావు, కొక్కిలగడ్డ రక్షణనిధి, ఆర్‌కే రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, తిరువీధుల జయరామయ్య, గండికోట శ్రీకాంత్‌రెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు, గౌరు చరితారెడ్డి, వై.సాయిప్రసాద్‌రెడ్డి, అత్తార్ చాంద్‌బాషా, దేశాయి తిప్పారెడ్డి, నారాయణస్వామి.

ఎం.సునీల్‌కుమార్, ఎన్.అమరనాథ్‌రెడ్డి, కలమట వెంకటరమణ, విశ్వరాయి కళావతి, పాముల పుష్పశ్రీవాణి, రావు సుజయకృష్ణ రంగారావు, బూడి ముత్యాలరావు, కిడారి సర్వేశ్వరరావు, గిడ్డి ఈశ్వరి, వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, పాలపర్తి డేవిడ్‌రాజు, గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్, ముత్తుముల అశోక్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఆదిరెడ్డి అప్పారావు, డీసీ గోవిందరెడ్డి, సి.నారాయణరెడ్డి, ముఖ్య నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ధర్మాన ప్రసాదరావు, సజ్జల రామకృష్ణారెడ్డి,కొలుసు పార్ధసారధి, మోపిదేవి వెంకటరమణ, అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, లక్ష్మీపార్వతి, విజయచందర్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఆళ్లపేరిరెడ్డి, వల్లభనేని బాలశౌరి, జంగా కృష్ణమూర్తి, బూరగడ్డ వేదవ్యాస్, పేర్ని నాని, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కొత్తపల్లి సుబ్బారాయుడు, కాపు రామచంద్రారెడ్డి, అమరనాధ్‌రెడ్డి, పూనూరు గౌతంరెడ్డి, వంగవీటి రాధా, మేరుగ నాగార్జున, తెర్లం బాలరాజు, గుంటూరు, కృష్ణా జిల్లాల అధ్యక్షులు మర్రి రాజశేఖర్, సామినేని ఉదయభానులు పాల్గొన్నారు.
 
ఆకట్టుకున్న నేతల ప్రసంగాలు
సమరదీక్ష వేదికపైనుంచి గురువారం వైఎస్సార్‌సీపీ నేతలు చేసిన ప్రసంగాలు ప్రజలను ఆలోచింపజేశాయి. వారు చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ సర్కార్ తీరును ఎండగడుతూ, బాబు హామీలపై ప్రశ్నలు సంధిస్తూ మాట్లాడినప్పుడు కరతాళధ్వనులు మోగాయి. మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు,నెల్లూరు  ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, రాజంపేట ఎంపీ మిధున్‌రెడ్డి,ఎమ్మెల్యే ఆర్.కె.రోజా, రాష్ట్రపార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు,  లక్ష్మీపార్వతిలు చేసిన ప్రసంగాలు ఆకట్టుకున్నాయి.
 
ఆలోచింపజేసిన వీడియోలు
ఎన్నికలకు ముందు పలు సభల్లో చంద్రబాబు ఇచ్చిన హామీల వీడియోలను సమరదీక్షలో ప్రదర్శించారు. ఆ వీడియోల్లో చంద్రబాబు ఏం మాట్లాడారో ఆ క్లిప్పింగులను, ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన ప్రకటనలను యథాతధంగా ప్రదర్శించారు. వీటికి ప్రజలనుంచి అనూహ్య స్పందన లభించింది.
 
బాబు హామీ - 1
అధికారంలోకి వస్తే వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తాం

వ్యవసాయ రుణాలు మొత్తం    :    87,617 కోట్లు
(బాబు అధికారంలోకి వచ్చే నాటికి)
2014 సెప్టెంబర్ నాటికి ఆ రుణాల మొత్తం    :    97,555 కోట్లు
సకాలంలో చెల్లిస్తే రైతులపై పడే వడ్డీ    :    పావలా వడ్డీ
బాబు మాఫీ చేస్తారన్న నమ్మకంతో చెల్లించ కపోవడంతో
రైతులపై పడిన అపరాధ వడ్డీ భారం    :    14 వేల కోట్లు
బాబు చెల్లించింది (తొలి ఏడాది)    :    4,689 కోట్లు (వడ్డీకే సరిపోదు)
బాబు చెల్లించింది (రెండో ఏడాది)    :    2,327 కోట్లు (వడ్డీకే సరిపోదు)
 
బాబు హామీ - 2
అధికారంలోకి వస్తే డ్వాక్రా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తాం

డ్వాక్రా సంఘాల మొత్తం రుణాలు    :    14,204 కోట్లు
సకాలంలో చెల్లిస్తే పడే వడ్డీ    :    సున్నా
చెల్లించని కారణంగా కాంపౌండ్ ఇంపాక్ట్ పేరుతో వడ్డీ     :    24 శాతం (రూ.2 చొప్పున వడ్డీ)
బాబు చెల్లిస్తారన్న ఉద్దేశంతో సకాలంలో చెల్లించని కారణంగా
పడిన 50 వేల రుణానికి పడిన వడ్డీ    :    12 వేలు
బాబు ఇప్పుడు ఇస్తానంటున్నది (అదీ అప్పుగానే)    :    3 వేల చొప్పున(వడ్డీకే సరిపోదు)
 
బాబు హామీ - 3
ఇంటికో ఉద్యోగం లేదంటే ఒక్కొక్కరికీ2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాం
రాష్ట్రంలో ఉన్నకుటుంబాలు మొత్తం    :    1.75 కోట్లు
ఇంటికో ఉద్యోగం    :    ఒక్క ఇంటికీ ఇవ్వలేదు
నిరుద్యోగులకు భృతి    :    ఏ ఒక్కరికీ చెల్లించలేదు
Share this article :

0 comments: