సమరదీక్షను విరమించిన వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సమరదీక్షను విరమించిన వైఎస్ జగన్

సమరదీక్షను విరమించిన వైఎస్ జగన్

Written By news on Thursday, June 4, 2015 | 6/04/2015


సమరదీక్షను విరమించిన వైఎస్ జగన్
గుంటూరు: గుంటూరు జిల్లాలోని మంగళగిరి 'వై' జంక్షన్లో రెండు రోజుల పాటు ఎర్రటి ఎండలో చేసిన 'సమర దీక్ష'ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం సాయంత్రం విరమించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ప్రజలనుద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. బయట తిరగాలంటేనే భయపడేలా ఎండలున్నాయి. వాటిని ఖాతరు చేయలేదు. రెండు రోజుల పాటు దీక్ష జరిగినా కూడా కష్టం అనిపించినా, ఈ ఎండలు తీక్షణంగా ఉన్నా.. అన్నీ పక్కకు నెట్టేసి ఇక్కడికొచ్చి చిక్కటి చిరునవ్వుతోనే ఇంతటి ఆప్యాయతను చూపిస్తున్నారని అన్నారు.

మీ అందరి ఆత్మీయతకు, ప్రేమానురాగాలకు ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా'  అన్నారు. ఈ సమర దీక్ష కన్నా ముందు విశాఖపట్నంలో ఒక భారీ ధర్నా చేశామన్నారు. అందులో తాను పాల్గొన్నానని, అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద ధర్నా జరిగిందని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

చంద్రబాబు ఎన్నికలు జరిగేటప్పుడు అధికారంలోకి రాకముందు ఏం మాటలు చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆరోజుకు, ఇప్పటికి చంద్రబాబు మనసులో వచ్చిన మార్పు ఏంటో తెలుసుకోవాలి. ఒక్కసారి ఎన్నికలు జరిగే సమయానికి, ఒక ఏడాది ముందుకు వెళ్దాం. అప్పుడు చంద్రబాబు ఓట్ల కోసం ఏం చెప్పారో చూద్దాం.

1) రైతుల రుణాలన్నీ నెలరోజుల్లో మాఫీ చేస్తాం
2) డ్వాక్రా సంఘాల రుణాలు పూర్తిగా మాఫీ చేసేబాధ్యత టీడీపీ తీసుకుంటుంది
3) ఇంటికో ఉద్యోగం ఇచ్చేవరకు నెలకు రూ. 2వేల నిరుద్యోగ భృతి
4) పదేళ్ల పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా

ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన మాటలివి. ఆయన ఊరూరా ఇదే మాటలు చెప్పారు. ఏ టీవీ ఆన్ చేసినా వినిపించే మాటలివే. జాబు కావాలంటే బాబు రావాలనేవారు.

ఈరోజు చంద్రబాబు పర్యటన గోదావరి జిల్లాల్లో జరిగింది. అక్కడ, ఈ హామీలన్నీ సమైక్యరాష్ట్రంలో ఇచ్చాను, వాటిని అమలుచేయడం ఇప్పుడు సాధ్యం కాదని ఆయన అన్నారు. ఈ హామీలన్నీ మీరు చూశారు. ఎన్నికలప్పుడు ఇలాగే చంద్రబాబు మీ వద్దకు వచ్చి ఇలాగే అడిగారు. బ్యాంకుల్లో రుణాలున్న రైతులంతా చేతులు పైకెత్తాలని అడిగారు. బంగారం బ్యాంకుల్లో పెట్టిన ఆడపడుచులు చేతులు పైకెత్తాలన్నారు. చేతులన్నీ పైకి లేచాక.. మీ రుణాలన్నీ నెలలోనే మాఫీ చేస్తామని ఇదే చంద్రబాబు అన్నారు. ఉద్యోగం కోసం పిల్లలు వెతుక్కుంటే, వాళ్లనూ వదిలిపెట్టలేదు. ప్రతి ఇంటికీ ఉద్యోగం ఇస్తాను, ఇవ్వలేకపోతే 2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మన రాష్ట్రంలో రెండు మ్యానిఫెస్టోలు విడుదల చేశారు. ఒకటి తెలంగాణ, మరొకటి సీమాంధ్రకు అన్నారు.
మే నెలలో టీవీ ప్రకటనలు ఇచ్చారు. ఎన్నికల సభలో ఆయన మాట్లాడిన ప్రతి మాటా విన్నారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి కాబట్టి రైతులు, డ్వాక్రా మహిళలు, పిల్లలతో నాకేం పని ఉందని ప్లేటు మారుస్తున్నారు. రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు ఉన్నారా అని సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తోంది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక మాట అనేవారు. ఎన్నాళ్లు బతికామన్నది కాదు ముఖ్యం.. బతికినన్నాళ్లు ఎలా బతికామన్నది ముఖ్యం అనేవారు. ఇదే చంద్రబాబు సెక్యూరిటీని పక్కన పెట్టి ప్రజల్లో తిరిగితే రాళ్లతో కొడతారు. ఒక అబద్ధాన్ని కప్పి పుచ్చడానికి రోజుకో అబద్ధం ఆడుతున్నారు.

మొన్నటికి మొన్న మరొకటి ఆశ్చర్యం అనిపించింది. ఆయన పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మీకు టీవీల్లో కనపడి ఉంటారు. 5 కోట్ల లంచం ఇచ్చిన పరిస్థితి కూడా కనిపించే ఉంటుంది. మా బాస్ తో మాట్లాడిస్తానని ఆయన చెప్పారు. అవి చాలకపోతే ఇంకా ఎక్కువ అడగండి, కావాలంటే మా బాస్ ఇస్తారని కూడా అదే రేవంత్ రెడ్డి చెప్పారు. 5 కోట్ల నగదుతో ఒక తెలంగాణ ఎమ్మెల్యేని కొనేందుకు వెళ్లారు. 18 మంది ఎమ్మెల్యేలను కొనడానికి 90 కోట్లు ఎక్కడినుంచి తెస్తున్నారని అడుగుతున్నాను. చంద్రబాబు సిగ్గన్నది లేకుండా.. పూర్తిగా బట్టలు విప్పేసి తిరుగుతున్నారు. చంద్రబాబు విజయవాడకు వచ్చి, చదువుకుంటున్న పిల్లలను పిలిపించి, అందరితో ప్రమాణాలు చేయించారు. అవినీతి లేని రాజ్యం కావాలని ఆయన ప్రమాణం చేశారట. నిండా అవినీతిలో మునిగిన నువ్వు.. అవినీతి రహిత రాష్ట్రం కావాలని ప్రమాణం చేయిస్తున్నావంటే నీకన్నా సిగ్గు మాలినవాడు ఎవడైనా ఉన్నాడా అని అడుగుతున్నాం. ఇదే చంద్రబాబు గత సంవత్సర కాలంలో రాష్ట్రానికి చేసిందేమీ లేదు. కనీసం కేంద్రంతో పోరాడి ప్రత్యేక హోదా అయినా తీసుకురమ్మని పోరాడాం. ఆయన్ను ఎన్నిసార్లు తిట్టినా.. ఢిల్లీ వాళ్లు ఇవ్వట్లేదని నసుగుతారు తప్ప వాళ్లను ఇంగ్లీషు, హిందీలలో తిట్టరు. మోదీకి వినపడుతుందన్న భయంతోనే ఆయన కనీసం ఇంగ్లీషులోతిట్టే ధైర్యం చేయరు. తనకు సంబంధించిన మంత్రులు ఇద్దరు కేంద్రంలో ఉంటారు. అయినా కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే వాళ్లిద్దరినీ ఎందుకు కొనసాగిస్తున్నారని అడుగుతున్నా. ఇవేవీ చంద్రబాబుకు ఎక్కవు.
 
హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు ఇంటికి, స్థలాలకు ఏమీ కాకూడదు గానీ రైతులకు ఇష్టం లేకపోయినా, 3 పంటలు పండే భూములను లాక్కోడానికి ఆయనకు మనసొస్తుంది. ఎన్నికల హామీలన్నీ చూశాం, రైతుల నుంచి భూములు లాక్కోవడాన్నీ చూశాం. చంద్రబాబు మెడలు వంచైనా సరే ఎన్నికల హామీలు నెరవేర్చే పరిస్థితి తీసుకొస్తాం. ఆరోజు ప్రజల చెవుల్లో కాలిఫ్లవర్లు పెట్టి ముఖ్యమంత్రి సీటు ఎక్కావు. ఇప్పుడు ప్రజలను వాళ్లబాధలు వాళ్లు పడండి అంటూ వదిలేయడం సరికాదని చెబుతున్నా. బలవంతంగా ఇక్కడినుంచి భూములు లాక్కుంటున్నావు. ఈ పాలన ఎక్కువ కాలం సాగదు. రెండేళ్లు ఉంటావో, మూడేళ్లుంటావో తెలియదు గానీ వచ్చేది మళ్లీ మేమే అని గట్టిగా చెబుతున్నా. బలవంతంగా నువ్వు లాక్కున్న భూములను మళ్లీ రైతులకు తిరిగి ఇస్తామని గట్టిగా చెబుతున్నా. చంద్రబాబుకు గట్టిగా చెబుతున్నా.. ఈసారి ఎన్నికలు వస్తే మాత్రం మీకు డిపాజిట్లు కూడా రావు. పైనుంచి దేవుడు మొట్టికాయలు వేస్తాడు. ప్రజల గుండెల్లో నుంచి ఒక కదలిక, ఒక కెరటం వస్తుంది. ఆ కెరటం ఉవ్వెత్తున పైకి లేచి నిన్ను బంగాళాఖాతంలో కలుపుతుంది.

చాలామంది మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన హామీలు, ఆయన చెప్పిన మాటలు, ఏడాది తర్వాత ఆయనమీద చేస్తున్న పోరాటాలు.. అన్నీ చెబుతున్నారు. ఇంజనీరింగ్ కాలేజి పెట్టిన ఓ యజమానిని అడిగాను.. ఫీజు రీయింబర్స్ మెంటు బకాయిలు వచ్చాయా అన్నా.. 4.5 కోట్ల బకాయిలు ఏడాది నుంచి రావాలని చెప్పారు. పిల్లలు సర్టిఫికెట్ల కోసం వస్తే, కాలేజి యాజమాన్యం ఆ ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పే పరిస్థితి ఉంది. ఏడాది నుంచి పిల్లల ఫీజుల బకాయిలు కూడా కట్టలేదు. చంద్రబాబును నిద్రపోనివ్వమని గట్టిగా చెబుతున్నాను. ఈ పోరాటాన్ని గట్టిగా కొనసాగిస్తాను. సంఘీభావం చూపించి మీ ఆత్మీయత చూపించినందుకు పేరుపేరునా ప్రతి ఒక్కరికీ మరొక్కసారి చేతులు జోడించి, శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను.
Share this article :

0 comments: