చంద్రబాబు ఆడియోతోపాటు ఇతర ఆధారాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు ఆడియోతోపాటు ఇతర ఆధారాలు

చంద్రబాబు ఆడియోతోపాటు ఇతర ఆధారాలు

Written By news on Sunday, June 7, 2015 | 6/07/2015

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆడియో విడుదల ఒక సంచలనంగా ఉంది.దీనితో చంద్రబాబు నాయుడు ఇరుకున పడతారా? లేదా అన్నది తేలడానికి కొంత టైమ్ పడుతుంది.ఎసిబి ఏ క్షణమైనా నోటీసు ఇవ్వవచ్చని అంటున్నారు.అదే జరిగితే చంద్రబాబు ఎసిబి ఆఫీస్ కు వెళ్లి వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుందా?లేక చంద్రబాటు ఇంటికే వెళతారా అన్నది తెలియాలి. చంద్రబాబు నేరుగా ఈ సంభాషణలో తాను మావాళ్లు ఇచ్చిన కమిట్ మెంట్ కు కట్టుబడి ఉంటానని చెప్పడం వినిపించింది.ఇదే కాకుండా మరికొందరు ప్రముఖులు కూడా ఇరుక్కున్నారని కొన్ని టీవీ చానళ్లలో కదనాలు వస్తున్నాయి.ఆయా సందర్భాలలో పలుమార్లు చంద్రబాబు ప్రస్తావన వచ్చినట్లు నిందితుల కాల్ డేటా వెల్లడిస్తున్నదని అంటున్నారు.ఓటుకు నోటు వ్యవహారంలో బాస్ చంద్రబాబేనని ఆధారం దొరికిందని టి.చానెల్ చెబుతోంది.చంద్రబాబుతో పాటు ఇద్దరు రాజ్యసభ సభ్యులు, కొందరు ఎమ్మెల్యేలు కూడా ఇరుక్కున్నారని ఆ చానెల్ చెబుతోంది. అవసరమైతే 150 కోట్ల మేర ఖర్చు చేయడానికి కూడా వెనుకాడబోమని టిడిపి నేతలు రాయబారం జరిపినట్లు కూడా ఆ చానల్ అంటోంది.ఇరవైమందికిపైగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం జరిగిందని అంటున్నారు.రేవంత్,ఉదయ సింహ, సెబాస్టియన్ ల కాల్ డేటాల ఆదారంగా పరిశీలన చేస్తే ఏభై సార్లు చంద్రబాబు ప్రస్తావన ఉన్నట్లు వెల్లడి అయిందని చెబుతున్నారు.

http://kommineni.info/articles/dailyarticles/content_20150607_38.php
Share this article :

0 comments: