చంద్రబాబును అరెస్టు చేయాలి: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబును అరెస్టు చేయాలి: వైఎస్ జగన్

చంద్రబాబును అరెస్టు చేయాలి: వైఎస్ జగన్

Written By news on Tuesday, June 9, 2015 | 6/09/2015


చంద్రబాబును అరెస్టు చేయాలి: వైఎస్ జగన్
న్యూఢిల్లీ: తన ఫోన్ ట్యాప్ చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంటున్న నేపథ్యంలో ఆయనే ఫోన్ లో స్టీఫెన్ సన్ తో మాట్లాడినట్లు ఒప్పుకున్నట్లు స్పష్టం అయిందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబును ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా చేర్చాలని, లేదంటే సామాన్యుడికి ఒక న్యాయం, చంద్రబాబుకు వేరొక న్యాయమని ప్రజలు విశ్వసించే ప్రమాదం ఉందని  చెప్పారు. చంద్రబాబును వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఓటుకు కోట్ల రూపాయల బాగోతంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి మెమోరాండం సమర్పించి చంద్రబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.

గత సంవత్సర కాలంలో చంద్రబాబు వివిధ కుంభకోణాల ద్వారా వేలాది కోట్ల రూపాయలు అక్రమంగా సంపాధించి ఆ డబ్బుతో ఎమ్మల్యేలను కొనే ప్రయత్నం చేశారని, ఒక్కో ఎమ్మెల్యేకు రూ.ఐదు కోట్ల నుంచి 20 కోట్ల రూపాయల వరకు ఎర చూపారని అన్నారు. ఈ క్రమంలో ఆయన రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారని చెప్పారు. చంద్రబాబు స్టీఫెన్ తో మాట్లాడిన ఆడియో టేపులు కూడా ఉన్నాయని, ఒక ముఖ్యమంత్రి అయితే మాత్రం వదిలి పెడతారా అని ప్రశ్నించారు. చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా చేసి జైలులో పెట్టాలని డిమాండ్ చేశారు. తనమీద వచ్చిన ఆరోపణలు తప్పించుకునేందుకు సమస్యను పక్కదారి పట్టించేందుకు విఫల యత్నం చేస్తున్నారని తెలిపారు. ఇది రెండు రాష్ట్రాల మధ్య సమస్య కానే కాదని జగన్ చెప్పారు.

ఇప్పటికైనా చంద్రబాబునాయుడితో రాజీనామా చేయించాలని, చేసేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని మరొక మెమోరాండం రాష్ట్రపతికి జగన్ ఇచ్చినట్లు సమర్పించారు. హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ రేపు కలిసి చంద్రబాబు వ్యవహారాన్ని ఆయన దృష్టికి తీసుకెళతామని తెలిపారు. అలాగే ప్రధాని నరేంద్రమోదీ అపాయింట్ మెంట్ కోరామని, అది ఖరారైతే చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరుతామని చెప్పారు.
Share this article :

0 comments: