తొలిరోజు ముగిసిన వైఎస్ షర్మిల పరామర్శయాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తొలిరోజు ముగిసిన వైఎస్ షర్మిల పరామర్శయాత్ర

తొలిరోజు ముగిసిన వైఎస్ షర్మిల పరామర్శయాత్ర

Written By news on Monday, June 29, 2015 | 6/29/2015

జిల్లెలగూడ: అన్నదాతలకు మద్దతు ధర, ఇన్ పుట్ సబ్సిడీ, ఉచిత విద్యుత్ అందించి భరోసా కల్పించిన ఘనత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిదేనని ఆయన తనయ వైఎస్ షర్మిల అన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ తో విద్యార్థులకు ఉచిత విద్య, ఆరోగ్యశ్రీ పథకంతో పేదలక వైద్యం అందించారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ మరణించి ఆరేళ్లు గడుస్తున్నా కోట్లాదిమంది తమ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని షర్మిల పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణాన్ని తట్టుకోలేక రంగారెడ్డి జిల్లాలో మరణించినవారి కుటుంబ సభ్యులను సోమవారం వైఎస్ షర్మిల పరామర్శించారు.

నాలుగు రోజుల రంగారెడ్డి జిల్లా పరామర్శయాత్రలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి జిల్లెలగూడ చేరుకున్నషర్మిల..  తొలుత అక్కడ మందలమ్మ చౌరస్తాలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంజయ్య ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ రోజు మహేశ్వరం మండలం మంఖాల్‌లో ఎండల జోసెఫ్ కుటుంబ సభ్యులను, ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలోని పోకల్‌కార్ మహేశ్‌జీ కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శించారు.
Share this article :

0 comments: