స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్లు మొదలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్లు మొదలు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్లు మొదలు

Written By news on Thursday, June 11, 2015 | 6/11/2015


స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్లు మొదలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల కోసం వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. కర్నూలు జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డి.వెంకటేశ్వర రెడ్డి నామినేషన్ దాఖలు చేయగా టీడీపీ నుంచి శిల్పా చక్రపాణి నామినేషన్ దాఖలుచేశారు. ఇక గుంటూరు జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గానికి వైఎస్సార్సీపీ తరఫున సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నామినేషన్ దాఖలు చేశారు.

శాసనమండలిలో స్థానిక సంస్థల నియోజకవర్గ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ మంగళవారం రాత్రి షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తొమ్మిదో తేదీ నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల స్వీకరణకు 16వ తేదీ చివరిరోజు. 17న నామినేషన్లను పరిశీలిస్తారు. 19 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. జూలై 3న పోలింగ్ నిర్వహించి, 7న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
Share this article :

0 comments: