ఐదు కుటుంబాలకు పరామర్శ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఐదు కుటుంబాలకు పరామర్శ

ఐదు కుటుంబాలకు పరామర్శ

Written By news on Wednesday, June 10, 2015 | 6/10/2015


తొలిరోజు..ఆప్యాయంగా
మలివిడత పరామర్శ యాత్రలో ఐదు కుటుంబాలకు పరామర్శ
 భువనగిరిలో 3, ఆలేరులో 2 కుటుంబాలను కలిసిన షర్మిల
 బీబీనగర్ టోల్‌ప్లాజా వద్ద వైఎస్ విగ్రహానికి నివాళి
 వెంకిర్యాల, కంచనపల్లి, ముస్త్యాలపల్లి, దాతరుపల్లి,
 యాదగిరిపల్లిలో పర్యటన
 ఐదు కుటుంబాల సభ్యులతో ఆత్మీయంగా మాట్లాడిన జగన్ సోదరి
 తమ వంతు అనురాగాన్ని చూపెట్టిన ఆయా కుటుంబాల సభ్యులు


 సాక్షి ప్రతినిధి, నల్లగొండ : తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో తలపెట్టిన మలి విడత పరామర్శ యాత్ర తొలిరోజు ఆప్యాయంగా సాగింది. ఉదయం 11:20 నిమిషాల సమయంలో జిల్లాకు చేరుకున్న షర్మిల నిర్విరామంగా దాదాపు 9 గంటలపాటు పర్యటించి ఐదు కుటుంబాలను పరామర్శించారు. బీబీనగర్ టోల్‌ప్లాజా వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుర్పించి యాత్రను ప్రారంభించిన షర్మిల భువనగిరి నియోజకవర్గం పరిధిలో మూడు, ఆలేరు నియోజకవర్గంలో రెండు కుటుంబాలను పరామర్శించారు. ఆయా కుటుంబాల పరిస్థితులను అడిగి తెలుసుకున్న ఆమె వారి కష్టసుఖాలను వాకబు చేశారు. వారి సమస్యలను ప్రేమతో ఆలకించి వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

 పరామర్శ సాగిందిలా.....
 తొలిరోజు షర్మిల పరామర్శ యాత్ర ఉత్సాహంగా సాగింది. ఆమె జిల్లాకు చేరుకోగానే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, గాదె నిరంజన్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అయిల వెంకన్నగౌడ్, భువనగిరి నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్, రాష్ట్ర పార్టీ జాయింట్ సెక్రటరీ గూడూరు జైపాల్‌రెడ్డిల నేతృత్వంలో ఘనస్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లతో ఆమెను స్వాగతించారు. ఈ సందర్శంగా జై జగన్... జోహార్ వైఎస్సార్ నినాదాలు మిన్నంటాయి. తొలుత గూడూరు టోల్‌ప్లాజా సమీపంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి షర్మిల నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె అక్కడినుంచి బయలుదేరి నేరుగా మండలంలోని వెంకిర్యాల గ్రామానికి వెళ్లారు.

 అక్కడ చెరుకు కృష్ణగౌడ్ కుటుంబాన్ని కలుసుకున్నారు. ఆ కుటుంబ సభ్యులను ‘నమస్తే అమ్మా.. బాగున్నారా’ అంటూ ఆప్యాయంగా పలకరించిన షర్మిల వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబం ఎలా జీవనం సాగిస్తుంది... కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు.. ఆరోగ్యం ఎలా ఉంది? పిల్లలు బాగా చదువుకుంటున్నారా.. తమ సొంత కుటుంబం మాదిరి అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఆమెకు కృష్ణగౌడ్ కుటుంబ సభ్యులు చల్లటి మజ్జిగన్నం తినిపించి తమ ఆప్యాయతను చాటుకున్నారు. ఆ తర్వాత వలిగొండ మండలం కంచనపల్లికి వెళ్లి కొలిచెల్మి అంజయ్య కుటుంబాన్ని కలుసుకున్నారు. వారిని కూడా ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్న ఆమె వారి పరిస్థితులను గురించి తెలుసుకున్నారు. అంజయ్య మనుమడు కౌశిక్ (ఏడాది వయసు)తో కాసేపు ఆడుకున్నారు.

 తన ఒడిలో కూర్చోబెట్టుకుని కౌశిక్‌కు స్వీటు తినిపించారు. అక్కడ కూడా అంజయ్య కుటుంబానికి  అండగా ఉంటామని హామీ ఇచ్చిన షర్మిల అక్కడినుంచి భువనగిరి మం డలం ముస్త్యాలపల్లికి బయలుదేరారు. మార్గమధ్యంలో పులిగిళ్ల గ్రామంలో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. అక్కడ గ్రామస్తులనుద్దేశించి మాట్లాడారు. అక్కడినుంచి ముస్త్యాలపల్లికి వెళ్లిన ఆమె కల్లెం నర్సయ్య కుటుంబాన్ని కలిశారు. వారితో మాట్లాడి కష్టసుఖాలను ఆప్యాయంగా పంచుకున్నారు. ఆ తర్వాత నే రుగా యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లికి వెళ్లి అక్కడ సుంచు చంద్రమ్మ కుటుం బాన్ని, అక్కడినుంచి అదే మండలంలోని యాదగిరిపల్లిలో చింతల కృష్ణ కుటుం బాన్ని కలిసి వారితో మాట్లాడారు. కృష్ణ కుమార్తెను దగ్గరకు తీసుకున్నారు. షర్మిల కలుసుకున్న ఐదు కుటుంబాల సభ్యులు ఇన్నేళ్ల తర్వాతయినా తమను గుర్తుపెట్టుకుని షర్మిల రావ డం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించడం గమనార్హం.

  పరామర్శయాత్రలో వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి,  కె.శివకుమార్, గాదె నిరంజన్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు అయిల వెంకన్నగౌడ్, కార్యదర్శులు వడ్లోజు వెంకటేశం, వేము ల శేఖర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శులు గూడూరు జైపాల్‌రెడ్డి, ఇరుగు సునీల్‌కుమార్, పిట్ట రాం రెడ్డి, ఎండి.సలీం, యువజన విభాగం అధ్యక్షుడు పచ్చిపాల వేణు యాదవ్, జిల్లా పార్టీ కోశాధికారి మరియదాస్, మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఫయాజ్, నేతలు పడాల శ్రీకాంత్, చల్లగురుగుల రఘుబాబు, మలుగు రాములు, మోడెపు జీవన్‌గౌడ్, కానుకుంట్ల యాదగిరి, బండ్రు ఆంజనేయులు, భట్టు, చెన్న రాజేశ్, బొబ్బూరి నరేశ్‌గౌడ్, ముద్రబోయిన వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

 అలాంటి నాయకుడు లేడు
 భువనగిరి : పరామర్శ యాత్రలో భాగంగా పలు కుటుంబాలను షర్మిల కలిసినప్పుడు వారి కళ్లలో ఆనందం కన్పించింది. నమస్తే అమ్మ బాగున్నారా అంటూ షర్మిల పలుకరింపే వారికి మనోస్థైర్యాన్ని నింపింది. ఓ వైపు కన్నీళ్లు, మరోవైపు ఆనంద భాష్పాలు నిండిన చెమర్చిన కళ్లతోనే షర్మిల, ఆయా కుటుంబాల సభ్యులు తమ ఆప్యాయతలను పంచుకున్నారు. వెంకిర్యాలలో చెర్కు కిష్టయ్యగౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా ఆయన కుమారుడు బాలరాజుగౌడ్ మాట్లాడుతూ వైఎస్సార్ లాంటి నాయకుడు లేడని మళ్లీ అలాంటి నాయకుడే వస్తే మీ కుటుంబం నుంచే రావాలని ఆకాంక్షించారు.

  ఆరోగ్య శ్రీ లాంటి ఎన్నో మర్చిపోలేని పథకాలు ప్రవేశపెట్టిన వైఎస్సార్ కూతురు తమ ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందని, ఐదేళ్ల తర్వాత కూడా తమను గుర్తు పెట్టుకుని వచ్చినందుకు కృతజ్ఞతలని చెప్పారు. బాలరాజుగౌడ్, ఆయన సోదరుడి కుమార్తెలు, కుమారులను పేరు పేరున పలకరించిన షర్మిల పిల్లలందరూ బాగా చదువుకోవాలని, మంచి ఉద్యోగాలోస్తే జీవితంలో సుఖపడతారని తెలిపారు. ఈ సందర్భంగా బాలరాజుగౌడ్ కుటుంబ సభ్యులు షర్మిలకు చల్లని మజ్జిగ అన్నం తినిపించారు. ఊరి సంప్రాదాయం మేరకు ఆ గ్రామ పూజారి చీర, గాజులు, కుంకుమ బహూకరించారు. ఆ తర్వాత కంచనపల్లిలో అంజయ్య కుటుంబ సభ్యులను కలిసిన షర్మిల అంజయ్య మనువడు కౌశిక్‌ను ముద్దాడారు. తన ఒడిలో కూర్చోబెట్టుకుని స్వీట్ తినిపించి లాలించారు.

 ఆ సమయంలో అంజయ్య కుమారుడు బాల మల్లేష్, భవాని దంపతులు మురిసిపోయారు. దైర్యంగా ఉండాలని చెప్పిన షర్మిల అక్కడి నుంచి ముస్త్యాలపల్లిలో కళ్లెం నర్సయ్య ఇంటికి వెళ్లారు. మీరేం చేస్తారు, పిల్లలు బాగున్నారా, ఏరి ఎక్కడ ఉన్నారూ ఎంటీ నాన్న బాగున్నావా? ఎం చదువుకుంటున్నావ్? ఆరోగ్యం ఎలా ఉంది? అంటూ ఆ కుటుంబ సభ్యుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు షర్మిల. ఈ సందర్భంగా జగనన్న ముఖ్యమంత్రి కావాలని తాము ప్రతి రోజూ ప్రార్థన చేస్తున్నామని నర్సయ్య కుటుంబ సభ్యులు చెప్పినప్పుడు ధైర్యంగా ఉండండి మన ప్రభుత్వం వస్తే మంచిరోజులు వస్తాయని షర్మిల చెప్పారు.

 ఇక యాదగిరిగుట్ట మండలంలోని దాతరుపల్లి గ్రామంలో చంద్రమ్మ మనువరాలు కవిత తీవ్ర ఉద్వేగానికి లోనైంది. షర్మిలను చూడగానే బోరున విలపించిన ఆమె షర్మిల చేతిలో చేయి వేసి తన సమస్యలను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల కవితతో చాలా సేపు మాట్లాడారు. ఆ తర్వాత యాదగిరిపల్లిలో చింతల కృష్ణ కుటుంబ సభ్యులు కూడా షర్మిలకు తమ కష్టసుఖాలు చెప్పుకున్నారు.
 
Share this article :

0 comments: