రేపు రాష్ట్రపతిని కలవనున్న వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రేపు రాష్ట్రపతిని కలవనున్న వైఎస్ జగన్

రేపు రాష్ట్రపతిని కలవనున్న వైఎస్ జగన్

Written By news on Monday, June 8, 2015 | 6/08/2015


రేపు రాష్ట్రపతిని కలవనున్న వైఎస్ జగన్
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం చంద్రబాబు వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ నాయకులు ఢిల్లీకి వెళ్లి మంగళవారం రాష్ట్రపతిని కలవనున్నారు. బుధవారం కేంద్ర హోంమంత్రి రాజనాథ్ సింగ్ తో భేటీ కానున్నారు. టీడీపీ ముడుపుల వ్యవహారంపై ఇప్పటికే గవర్నర్ నరసింహన్ కు వైఎస్సార్ సీపీ ఫిర్యాదు చేసింది.

కాగా, ఓటుకు నోటు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు నైతిక బాధ్యతగా సీఎం పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేసింది. చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏపీలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నట్టు తెలిపింది.
Share this article :

0 comments: