నిర్దోషిత్వాన్ని నిరూపించుకోండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నిర్దోషిత్వాన్ని నిరూపించుకోండి

నిర్దోషిత్వాన్ని నిరూపించుకోండి

Written By news on Monday, June 8, 2015 | 6/08/2015


నిర్దోషిత్వాన్ని నిరూపించుకోండి'
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో భాగంగా నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో  ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు  ఫోన్ సంభాషణలు జరిపిన ఆడియో టేపులు తనవి కావని టీడీపీ చెప్పడంపై వైఎస్సార్ సీపీ తీవ్రంగా మండిపడింది. ఈ వ్యవహారం నుంచి చంద్రబాబు బయటపడటానికి యత్నిస్తూ ఎదురుదాడికి దిగడం సిగ్గు చేటని వైఎస్సార్ సీపీ నేతలు మైసూరా రెడ్డి, పార్థసారధిలు విమర్శించారు.  వారు సోమవారం మీడియాతోమాట్లాడుతూ.. ఈ అంశాన్ని రాష్ట్రాల మధ్య సమస్యగా అంటగట్టాలని టీడీపీ నేతలు చూస్తున్నారని విమర్శించారు. ఇది ఎంతమాత్రం రాష్ట్రాల మధ్య సమస్య కాదని..  వ్యక్తుల మధ్య సమస్య మాత్రమేనని స్పష్టం చేశారు.
 
సమస్యను పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు రకరకాల విన్యాసాలు చేస్తున్నారన్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.  ఈ వ్యవహారంలో చంద్రబాబు నిర్దోషి అయితే విచారణ జరిపించుకుని నిరూపించుకోవాలన్నారు. ఓటుకు నోటు వ్యవహారం నిజంగా సిగ్గు చేటన్నారు. చంద్రబాబు వాయిస్ నిజం కాకపోతే సీబీఐ విచారణకు సిద్ధం కావాలన్నారు.
 
చంద్రబాబు వాయిస్ నిజం కాకపోతే సీబీఐ విచారణకు సిద్ధం కావాలన్నారు. చంద్రబాబు రాజీనామాను కోరుతూ  మంగళవారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్ సీపీ ధర్నా చేస్తున్నట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించారు.
Share this article :

0 comments: