గవర్నర్‌పై విశ్వాసం లేకుంటే ... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గవర్నర్‌పై విశ్వాసం లేకుంటే ...

గవర్నర్‌పై విశ్వాసం లేకుంటే ...

Written By news on Thursday, June 18, 2015 | 6/18/2015



వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన డిమాండ్
గవర్నర్‌పై విశ్వాసం లేకుంటే వైదొలగాలని మంత్రులకు సూచన

సాక్షి, హైదరాబాద్: ఏపీలో పరిపాలన పూర్తిగా పడకేసిందని, ఓటుకు కోట్లు కేసులో దోషిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు ప్రజలపై దృష్టిని సారించడం లేదని, అందుకే ఆయన పదవి నుంచి తప్పుకోవాలని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. పార్టీ అధికార ప్రతినిధి కె.పార్థసారథితో కలిసి ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

రాజ్యాంగంపై ప్రమాణం చేసి సీఎం పదవిని చేపట్టిన చంద్రబాబు దానిని అతిక్రమిస్తూ ప్రజాస్వామ్యంలో చెడు సంప్రదాయాలను నెలకొల్పుతున్నారని విమర్శించారు. పొరుగు రాష్ట్రంలోని ఒక దర్యాప్తు సంస్థ మీకు అనుకూలంగా వ్యవహరించేలా చేయడం లేదని గవర్నర్‌ను మార్చమంటారా? అని ప్రశ్నించారు.  ఓటుకు కోట్లు కేసులో బాబుపై సాక్ష్యాధారాలున్నందున విచారణకు సహకరించి కోర్టులో తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, సెక్షన్-8 అమలు చేయాలని, మా దగ్గర కూడా ఏసీబీ ఉందని ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారని చెప్పారు. గవర్నర్  నరసింహన్‌పై విశ్వాసం లేదని మాట్లాడుతున్న ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, రావెల కిశోర్‌బాబు మంత్రివర్గం నుంచి వైదొలగాలన్నారు.
 
బాబు ధ్యాసంతా ఏసీబీ కేసు నుంచి బయటపడడంపైనే

వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతల భేటీలో అభిప్రాయం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఓటుకు కోట్లు వ్యవహారం నేపథ్యంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై ప్రధానంగా చర్చ జరిగింది. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా పడకేసిన అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజల గురించి ఆలోచించడం మానేసి తాను ఏసీబీ కేసు నుంచి ఎలా బయటపడాలనే అంశంపైనే ఎక్కువగా సమావేశాలు నిర్వహిస్తున్నారని సమావేశం అభిప్రాయపడింది.
 
తాను స్వయంగా ఆరోపణలు ఎదుర్కొంటూ రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌పై నిందలేయడాన్ని నేతలు గర్హించారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ైవె వీ సుబ్బారెడ్డి, ఎంవీ మైసూరారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, కె.పి.సారథి, అనంత వెంకటరామిరెడ్డి, బొత్స సత్యనారాయణ, గొట్టిపాటి రవికుమార్, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, అంబటి రాంబాబు, జోగి రమేష్, సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
Share this article :

0 comments: