అవినీతి సీఎంను కేంద్రం కాపాడకపోవచ్చు: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అవినీతి సీఎంను కేంద్రం కాపాడకపోవచ్చు: వైఎస్ జగన్

అవినీతి సీఎంను కేంద్రం కాపాడకపోవచ్చు: వైఎస్ జగన్

Written By news on Thursday, June 11, 2015 | 6/11/2015


అవినీతి సీఎంను కేంద్రం కాపాడకపోవచ్చు: వైఎస్ జగన్
న్యూఢిల్లీ : అవినీతి ముఖ్యమంత్రిని కేంద్రప్రభుత్వం కాపాడుతుందని తాను భావించడం లేదని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ఢిల్లీలో కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు నాయుడిని ఎ-1 ముద్దాయిగా చేర్చాలని వైఎస్ జగన్ డిమాండు చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో అవినీతికి పాల్పడిన డబ్బుతో తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనాలనుకున్నారని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన  ఆడియో, వీడియో టేపులు ఇప్పటికే బయటకు వచ్చాయని గుర్తుచేశారు. రేవంత్ కేసులో చంద్రబాబును ఎ-1 ముద్దాయిగా ఎందుకు చేర్చడం లేదని వైఎస్ జగన్ ఈ సందర్భంగా ప్రశ్నించారు.
ఏడాది పాలనలో చంద్రబాబు చేసిన అవినీతిపై దర్యాప్తు చేయాల్సిందిగా కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కోరినట్లు వైఎస్ జగన్ చెప్పారు. తనపై చేసిన ఆరోపణలు టీడీపీ, కాంగ్రెస్ కుట్రపూరితంగా చేసినవేనన్నారు. ఆ సమయంలో తాను సీఎం, ఎంపీ.. చివరకు ఎమ్మెల్యేగా కూడా లేనని తెలిపారు. తాను సచివాలయంలో అడుగుపెట్టలేదని, ఏ అధికారికీ ఫోన్లు కూడా చేయలేదని అన్నారు. అయినా తనపై వచ్చిన ఆరోపణలను ధైర్యంగా ఎదుర్కొన్నట్లు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు.
Share this article :

0 comments: