పదవుల కోసం కాదు... బాబుపై పోరాడేందుకే: బొత్స - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పదవుల కోసం కాదు... బాబుపై పోరాడేందుకే: బొత్స

పదవుల కోసం కాదు... బాబుపై పోరాడేందుకే: బొత్స

Written By news on Sunday, June 7, 2015 | 6/07/2015


పదవుల కోసం కాదు... బాబుపై పోరాడేందుకే: బొత్స
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై పోరాడేందుకే తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వెల్లడించారు. అంతేకాని పదవుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ఆయన విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో బొత్స సత్యనారాయణ.. తన కుటుంబ సభ్యులతోపాటు చేరారు.  విజయ నగరం జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు కూడా బొత్సతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడారు.

"చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని ప్రభుత్వం విస్మరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్ లో ఉండి పోరాడలేమనే.. వైఎస్ఆర్సీపీలో చేరాను. కాంగ్రెస్ పార్టీ తనకు ద్రోహం చేయలేదు. ఆ పార్టీలో వివిధ పదవులు అనుభవించాను. తన రాజకీయ అనుభవమంతా వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం కృషి చేస్తా. ఎన్నికల కోసమో.. అధికారం కోసమో పార్టీలో చేరలేదు. వైఎస్ కేటినెట్ లో తీసుకున్న నిర్ణయాలకు సమష్టి బాధ్యత వహిస్తాం.

రుణమాఫీ కోసం బడ్జెట్ లో రూ.9 వేల కోట్లు కేటాయించి.. రూ.24 వేల కోట్ల మాఫీ చేశామని చంద్రబాబు అంటున్నారు. చంద్రబాబు పథకాలు చూసి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోంది. ప్రజల కష్ట నష్టాలు తెలిసిన వాణ్ని. అభివృద్ధిన ఒకేచోటే కేంద్రీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఏపీలో టీడీపీకి ప్రత్యామ్నాయం వైఎస్సార్సీపీనే. విజయనగరంలోని కాంగ్రెస్ కేడర్ అంతా వైఎస్సార్సీపీలో చేరినట్టే" అని బొత్స మీడియా సమావేశంలో వెల్లడించారు.
Share this article :

0 comments: