మంత్రి పీతల కోసమే లంచం తీసుకున్నా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మంత్రి పీతల కోసమే లంచం తీసుకున్నా

మంత్రి పీతల కోసమే లంచం తీసుకున్నా

Written By news on Wednesday, June 10, 2015 | 6/10/2015


మంత్రి పీతల కోసమే లంచం తీసుకున్నా
- ఏసీబీకి చిక్కిన ఉద్యోగి వెల్లడి

విజయవాడ సిటీ:
 రాష్ట్ర మంత్రి పీతల సుజాత మరో వివాదంలో చిక్కుకున్నారు. మంత్రి, ఆమె కుటుంబ సభ్యుల ఖర్చుల కోసమే లంచం తీసుకున్నానంటూ ఏసీబీకి పట్టుబడిన ఒక మహిళా ఉద్యోగి చెప్పడం కలకలం రేపింది.
సెక్యూరిటీ డిపాజిట్ సొమ్ము తిరిగి ఇచ్చేందుకు రూ. 15 వేలు లంచం తీసుకుంటూ కృష్ణా జిల్లా మహిళా, శిశు సంక్షేమ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ ఉండ్రాజవరపు జెస్సీ డైమండ్ రోసీ సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే.

ఆ లంచం తన కోసం కాదని, మంత్రి పీతల  ఖర్చుల కోసం వసూలుచేస్తున్నానంటూ ఏసీబీ విచారణలో చెప్పినట్లు సమాచారం. పైగా మంత్రి కోసం ఎప్పుడు ఎంత ఖర్చు పెట్టాననే వివరాలు నమోదు చేసిన ఒక డైరీని ఏసీబీ అధికారులకు చూపించారు. మంత్రి ఖర్చుల వివరాల డైరీని స్వాధీనం చేసుకుని, ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులకు తెలియజేశారు. వారి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు దర్యాప్తు అంశాలను గోప్యంగా ఉంచారు.
http://www.sakshi.com/news/andhra-pradesh/i-took-bride-for-minister-sujatha-says-women-employee-247360?pfrom=home-top-story
Share this article :

0 comments: