అవినీతికి ప్యాంటు, చొక్కా వేస్తే.. అదే ‘బాబు’ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అవినీతికి ప్యాంటు, చొక్కా వేస్తే.. అదే ‘బాబు’

అవినీతికి ప్యాంటు, చొక్కా వేస్తే.. అదే ‘బాబు’

Written By news on Friday, June 12, 2015 | 6/12/2015


అవినీతికి ప్యాంటు, చొక్కా వేస్తే.. అదే ‘బాబు’
 సాక్షి, తిరుమల : ‘‘అవినీతికి ప్యాంటు, చొక్కా వేస్తే.. అదే చంద్రబాబు’’ అని నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ఎద్దేవా చేశారు. గురువారం ఆమె తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు వ్యవహారంతో సీఎం చంద్రబాబు రాష్ట్రం పరువును బజారుకీడ్చారన్నారు. చిత్తూరు జిల్లా వాసిగా ఈ జిల్లా వాసులను తలెత్తుకోలేని దౌర్భాగ్య స్థితిలోకి నెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఏనాడు  చిత్తూరు జిల్లాభివృద్ధిని పట్టించుకోలేదని, సాగునీరు, తాగునీరే కాకుండా కనీసం ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించలేని చంద్రబాబు అవినీతి రాజకీయాలు చేయడం సిగ్గు చేటన్నారు.

సీఎం చంద్రబాబు ఏడాది పాలనలో తాను ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటీ  నెరవేర్చలేదన్నారు. అలాంటి వ్యక్తి తన ఏడాది పాలనపై సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదమన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని దూషించడం మినహా అభివృద్ధి పరంగా సీఎం చంద్రబాబు చేసింది శూన్యమని ఎమ్మెల్యే రోజా అన్నారు. అనంతరం ఆమె తిరుచానూరుకు చేరుకుని, పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్నారు
Share this article :

0 comments: