ఏడాది పాలనలో..అంతులేని అవినీతి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఏడాది పాలనలో..అంతులేని అవినీతి

ఏడాది పాలనలో..అంతులేని అవినీతి

Written By news on Tuesday, June 9, 2015 | 6/09/2015


ఏడాది పాలనలో..అంతులేని అవినీతి
తెలుగుదేశంపార్టీ ఏడాది పాలనలో అవినీతి వరదలై పారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి మడుగులో నిలువెల్లా కూరుకుపోయారు. గడచిన ఏడాదికాలంలో ఆయన పాలన అక్రమార్జనే లక్ష్యంగా సాగింది. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచీ అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. నామినేషన్ పద్ధతి అంటూ పచ్చదండుకు పనులు కట్టబెట్టి భారీ అవినీతికి పాల్పడ్డారు. ఇలా ప్రాజెక్టులు, పనులు, ఒప్పందాల విషయంలో ఏడాది కాలంలో సుమారు రూ.12 వేల కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఇక రాష్ట్ర రాజధాని పేరుతో బినామీలకు, కమిషన్ల ప్రాతిపదికన సింగపూర్ కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల విలువైన భూములను అప్పనంగా కట్టబెట్టి భారీ రియల్ దందాకు స్వయంగా చంద్రబాబు తెరతీశారు.
 
 
 పోలవరాన్ని పక్కకునెట్టి పట్టిసీమ
 
 ఆంధ్రప్రదేశ్‌కు వరప్రదాయిని పోలవరం ప్రాజె క్టును పక్కకునెట్టి పట్టిసీమ ప్రాజెక్టును తెరమీదకు తేవడం వెనుక పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందన్న ఆరోపణలపై అసెంబ్లీలో చర్చ జరిగింది. రూ.1,300 కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు టెండర్లు కమీషన్ కోసం తమకు అనుకూలమైన కాంట్రాక్టర్‌కే దక్కేలా చేశారు. 21.9 శాతం అధికధరలకు కోట్ చేసిన మెగా సంస్థకు పనులు కట్టబెట్టేశారు. ఇందుకు ప్రతిఫలంగా చినబాబుకు రూ.400 కోట్ల మేర ముడుపులు ముట్టినట్లు ఆరోపణ లున్నాయి.
 
 వంశధారలో కాంట్రాక్టర్లకు లబ్ధి
 
 వంశధారలో రెండో దశలో ప్యాకేజీ 86, 87 ప్యాకేజీల్లో మిగిలిపోయిన రూ. 90 కోట్ల విలువైన ప నులను తాజా ఎస్‌ఎస్‌ఆర్‌ల ప్రకారం అంచనా వ్యయాన్ని రూ. 429 కోట్లకు పెంచి అప్పగించడానికి రంగం సిద్ధమైంది. ఇందు కోసం రూ. 100 కోట్ల విలువైన పనులకు సీఎస్ నేతృత్వంలో హైపవర్ కమిటీ అనుమతించాలన్న నిబంధనను తోసిపుచ్చారు. ప్రతిఫలం గా తాజా అంచనా వ్యయంలో సగం వాటా ప్రభుత్వ పెద్దలకు దక్కుతుందని ఇంజనీర్లు చెబుతున్నారు.
 
 పోలవరానికి చంద్రగ్రహణం
 
 పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కినా.. ప్రాజెక్టు పనులను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోలవరం ప్రాజెక్టు అథారిటీకి అప్పగించకుండా.. చంద్రగ్రహణం పట్టించేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆపార్టీ ఎంపీకి చెందిన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌కు రూ. 250 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ చెల్లించారు. ఈ ఏడాదికాలంలో అక్కడ 250 మీటర్ల పని కూడా జరగలేదు. పనులు చేసే సామర్థ్యం కాంట్రాక్టర్‌కు లేదని తెలిసినా తెలియనట్లే నటించడం వెనక.. రూ. 100 కోట్ల కాసుల కక్కుర్తి స్పష్టంగా కనిపిస్తోందని నీటి పారుదలశాఖ అధికారులే చెబుతున్నారు.
 
 
 కాంట్రాక్టర్ల నుంచి కొట్టేయడానికి జీవో-22
 
 సిమెంట్, స్టీలు, ఇంధనం.. ధరల పెరుగుదలకు అను గుణంగా కాంట్రాక్టర్లు ఒప్పంద వ్యయాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంది. లేబర్, మిషనరీ, మెటీరియల్, కంట్రోల్ బ్లాస్టింగ్, డీవాటరింగ్ లాంటి ధరల పెంచుకోవడానికి అవకాశం లేని అంశాల్లోనూ చంద్రబాబు ప్రభుత్వం పెంపుదలకు అవకాశం కల్పిస్తూ జీవో-22ను తీసుకొచ్చారు. ప్రభుత్వ అంచనా వ్యయం ప్రకారమే జీవో-22 ప్రకారం కాంట్రాక్టర్లకు అదనంగా రూ. 1,796 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అంచనా. వాస్తవంగా అందుకు రెట్టింపు భారం ఖజానా మీద పడుతుందని అధికారుల అంచనా. ఈ వ్యవహారం వెనుక కనీసంగా రూ.5,100 కోట్ల మేరకు అవినీతి పారుదల ఉందన్న విమర్శలున్నాయి.
 
 
 జరిమానా కట్టి మరీ లూటీ
 కరవుతో 2013, 2014 ఖరీఫ్‌లలో పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించడానికి నిరాకరించిన సీఎం చంద్రబాబు.. మార్చిలో ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లి మరీ అగమేఘాలపై రూ.2,067 కోట్లను పారిశ్రామిక రాయితీల రూపంలో చెల్లించా రు. ఓవర్ డ్రాఫ్ట్ అయి నందుకు ఆర్బీఐ రూ. ఎనిమిది కోట్లను అపరాధరుసుం రూపంలో వసూలు చేసినా పట్టించుకోలేదు. బకాయిల విడుదలకు ప్రతిఫలంగా రూ.700 కోట్ల ముడుపులు ముట్టినట్లు అధికార వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
 
 అవుకు సొరంగంలో అవినీతి
 గాలేరు-నగరి సుజల స్రవంతి (జీఎన్‌ఎస్‌ఎస్)లో ప్యాకేజ్-30లో భాగంగా చేపట్టిన అవుకు సొరంగంలో అవినీతి ప్రవహించింది. సొరంగం లో రాళ్లు ఊడిపడు తున్నం దున సిమెంట్ పూత స్థానంలో స్టీల్ ఫైబర్ లైనింగ్ చేయడానికి అంగీకరించడం, పూతలో మార్పు చేయాల్సిన విస్తీర్ణాన్ని భారీగా పెంచడం ద్వారా కాంట్రాక్టర్‌కు రూ. 100 కోట్లు అదనంగా చెల్లించడానికి సర్కారు అంగీకరించింది. అందులో మెజారిటీ వాటాను దశలవారీగా నొక్కేయడానికి ప్రభుత్వ పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం.
 
 పుష్కరాల్లోనూ అవినీతి వరద
 జూలై నెలలో రాష్ట్ర ప్రభుత్వం గోదావరి పుష్కరాలను నిర్వహించేందుకు రూ. 1,500 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. ఇందులో సింహభాగం ఆర్‌అండ్‌బీ శాఖ రూ.600 కోట్ల వరకు కేటాయించింది. ఇతర పనులకు మరో రూ. 900 కోట్లు కేటాయించింది. ఈ పనులన్నింటిలోనూ ‘మీకింత-మాకింత’.. అన్న రీతిలోనే కమీషన్ల పర్వానికి తెరలేపారు. కాంట్రాక్టర్ల వద్ద నుంచి 30 శాతం కమీషన్లు దండుకున్నారు. పుష్కర పనుల్లో రూ. 450 కోట్లకు పైగా అవినీతి జరుగుతుందంటూ బాహాటంగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
 
 అదనపు మద్యం ఉత్పత్తికి ముడుపులు
 రాష్ట్రంలో మద్యం కొరత దృష్ట్యా అదనపు మద్యం ఉత్పత్తికి డిస్టిలరీల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. గతేడాది దరఖాస్తులు ఆహ్వానించి కమీషన్ ముట్టజెబితేనే అనుమతులు ఇస్తామనే రీతిలో వ్యవహరించడంతో దరఖాస్తు చేసుకున్న 12 డిస్టిలరీలలో నాలుగు డిస్టిలరీలకు సీఎం చంద్రబాబు సంతకం పెట్టారు. ఈ వ్యవహారంలో రూ.40 కోట్లు చేతులు మారినట్లు విశ్వసనీయ సమాచారం.
 
 బెరైటీస్ టెండర్లలో గోల్‌మాల్
 బెరైటీస్ ఖనిజానికి అంతర్జాతీయ మార్కెట్ ధరలో 70 నుంచి 75 శాతం కనీస ధరగా నిర్ణయించాలని నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ఇచ్చిన జీవోను రద్దు చేసి 65 - 70 శాతం కనీస ధరగా ఖరారు చేయాలంటూ జీవో ఇప్పించారు. చివరకు అంతర్జాతీయ ధరలో 65 శాతాన్ని మాత్రమే బేసిక్ ధరగా నిర్ణయించి టెండర్లు పిలవడంవల్ల ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థకు రూ. 280 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ వ్యవహారంలో ఒక ఎంపీ మధ్యవర్తిత్వం ద్వారా ప్రయోజనం పొందిన బెరైటీస్ సంస్థలు చినబాబుకు రూ. 300 కోట్లు ముట్టజెప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
 ఇసుక నుంచి నోట్ల కట్టలు పిండేశారు
 రాష్ట్రంలో ఇసుక రవాణాకు అడ్టుకట్ట వేయడం పేరుతో ఇసుక రీచ్‌లను మహిళా సంఘాలకు కట్టబెట్టారు. అయితే మహిళా సంఘాల మాటులో ఇసుక రీచ్‌లను పార్టీ నేతలు చేజిక్కించుకుని సొమ్ము చేసుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఇసుక అమ్ముతున్న 343 రీచ్‌లలో సరాసరి 10 లారీల ఇసుక వ్యాపారం జరిగినా లారీ ధర రూ. 15 వేలు అనుకున్నా.. 8 నెలల కాలంలో రూ. 1,234 కోట్ల వ్యాపారం జరగాలి. కానీ, ప్రభుత్వం లెక్కల్లో రవాణా చార్జీలు కలిపి అమ్మినట్టు చూపుతుంది కేవలం రూ. 545 కోట్లే. మిగిలిన దాదాపు రూ. 700  కోట్లు అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లాయి.
 
 ‘చంద్రన్న కానుక’లోనూ నొక్కారు
 సంక్రాంతి పండుగ సందర్భంగా రూ.241 కోట్లతో ‘చంద్రన్న కానుక’ పథకం ద్వారా తెల్ల రేషన్‌కార్డుల లబ్ధిదారులకు నిత్యావసరాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కాలంచెల్లిన బెల్లం, చక్కెర, శనగలు, గోధుమపిండిని అస్మదీయ కాంట్రాక్టర్ల నుంచి అధికధరలకు కొనుగోలు చేసిన ప్రభుత్వం.. నెయ్యిని అధికధరకు చంద్రబాబు సొంత సంస్థ అయిన హెరిటేజ్ డెయిరీ నుంచి సేకరించింది. ఈ వ్యవహారంలో రూ.75 కోట్ల మేర ముడుపులు చినబాబుకు చేరినట్లు బలమైన ఆరోపణలు వచ్చాయి.
 
 అదనపు విద్యుత్ కొనుగోల్‌మాల్
 2015-16 సంవత్సరానికి స్వల్పకాలిక కొనుగోళ్లకు ఏపీఈఆర్‌సీ 757 మిలియన్ యూనిట్లను మాత్రమే అనుమతించగా దాని ధర రూ. 420 కోట్లు. అయితే ప్రభుత్వం ఈఆర్సీ ఆదేశాలను పక్కనబెట్టి 17,520 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేసి రూ. 8,380 కోట్ల మేరకు చెల్లిస్తోంది. అయితే తీవ్ర విమర్శ నేపథ్యంలో స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లలో 13,140 మిలియన్ యూనిట్లు (1500 మెగావాట్లు) మేరకు రద్దు చేసింది. అలా రద్దు చేసినందుకు పెనాల్టీగా రూ.1500 కోట్లు చెల్లించాల్సివచ్చింది. అలాగే మరో 4,380 మిలియన్ యూనిట్లు (500 మెగావాట్లు) కొనసాగిస్తుండగా అందుకు ప్రభుత్వం రూ .2,200 కోట్లు వెచ్చిస్తోంది.  ఈ రకంగా మొత్తంగా ప్రస్తుతం కొనుగోలు వ్యయం, పెనాల్టీ కలిపి కొనుగోలు చేస్తున్న విద్యుత్ ధర రూ.17,200 కోట్లు కాగా ఇందులో రూ.2000 కోట్ల మేరకు గోల్‌మాల్ జరిగిందని తెలుస్తోంది.
 
 గ్యాస్ విద్యుత్ యజమానుల జేబులు నింపి...
 రాష్ట్రంలో ప్రస్తుతం గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టుల నుంచి 1.2 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. దీన్ని మరో 1.2 మిలియన్ యూనిట్లకు పెంచేందుకు చంద్రబాబు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ కొరత లేనప్పటికీ కూడా ప్రైవేట్ విద్యుత్ కంపెనీల వ్యాపారం పెంచే చర్యల్లో భాగంగా గ్యాస్ పూలింగ్ విధానంలో మరో 30 శాతం గ్యాస్‌ను కేటాయింపులు చేయించారు. దానితో ఆగకుండా గ్యాస్‌పై 25 శాతం వ్యాట్‌కు రెండేళ్లపాటు మినహాయింపునిస్తూ జీవో-182 జారీ చేశారు. ఫలితంగా రాష్ట్ర ఖజానాకు రూ.2,300 కోట్ల రూపాయలు గండిపడుతుందని వాణిజ్య పన్నుల శాఖ తేల్చింది. ఈ వ్యవహారంలో రూ.500 కోట్ల మేరకు కమీషన్లు ముట్టాయని ఆరోపణలున్నాయి.
 
 బొగ్గులో రూ. 250 కోట్ల ముడుపుల కథ
 ప్రస్తుతం ఏపీ జెన్‌కో ప్రాజెక్టులకు ఏడాదికి 1.5 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం. అయితే ఏటా 4.5 మెట్రిక్ టన్నులు దిగుమతి చేసుకుంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బొగ్గు ధర 60 డాలర్లకు తగ్గినా గతంలో మాదిరిగానే టన్ను రూ. 5,510 చొప్పున కొంటోంది.  ఫలితంగా ఏటా దాదాపు రూ. 500 కోట్ల మేర జెన్‌కోకు నష్టం వాటిల్లుతోందన్న ఆరోపణలున్నాయి. ఇందులో రూ. 250 కోట్లు ప్రభుత్వ పెద్దలకు ముడుపులుగా అందుతున్న కారణంగానే గ్లోబల్ టెండర్లు తెరవడం లేదని అధికార వర్గాల కథనం.
 
 రేషన్ షాపుల పునరుద్ధరణకూ మామూళ్లు
 ప్రజలకు నిత్యావసరాలను సరఫరా చేసే రేషన్ షాపుల డీలర్ షిప్‌లివ్వడంలోనూ జిల్లా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారు. కొత్తగా డీలర్‌షిప్ లెసైన్స్ మంజూరుకు మూడు లక్షలు, ఒక్కో ఇ-సేవా కేంద్రం నుంచి నెలకు రూ.25 వేలు మామూళ్లు వసూలు చేస్తున్నారు. భూ వినియోగ మార్పిడి పత్రం కావాలంటే ఎకరాకు రూ.10 వేలు ఇవ్వాల్సిందే.
 
 నామినేషన్ విధానంలో దోపిడీ
 నామినేషన్ విధానంలో పనులు చేసుకునేందుకు కాంట్రాక్టర్లకు అనుకూలంగా జీవోలు తెచ్చారు. సీఎం పరిపాలన సాగించే సచివాలయంలో సౌకర్యాలు, క్యాంపు ఆఫీసు లో రహదారులు నిర్మాణ పనులన్నీ కాంట్రాక్టు విధానంలో కట్టబెడుతున్నారు. అన్ని శాఖల్లోనూ నామినేషన్ విధానంలో పనులు అప్పగించడం వల్ల వంద కోట్ల అవినీతికి ప్రభుత్వం తెరతీసింది.
 
 ఇవి కాకుండా...
 ప్రైవేటు వైద్య కళాశాల్లో బీ కేటగిరీ సీట్లను పూర్తిగా యాజమాన్య కోటా కిందకు మార్చిన వ్యవహారం, అడ్డగోలుగా డీఎడ్ కాలేజీల అనుమతి వ్యవహారం, ఒకచోటి నుంచి మరో చోటికి కాలేజీలను తరలింపుకు అనుమతివ్వడం, ఇలా అడుగ డుగునా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇవి జేబుల్లో వేసుకున్న నిధు లు మాత్రమే. ఇవి కాకుండా పార్టీ నేతలకు, పారిశ్రామిక వేత్తలకు ప్రయోజనం చేకూర్చిన నిర్ణయాలెన్నో ఉన్నాయని చెబుతున్నారు.

http://www.sakshi.com/news/andhra-pradesh/too-much-corruption-in-chandrababus-one-year-ruling-247125?pfrom=home-top-story
Share this article :

0 comments: