మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 66వ జయంత్యుత్సవాలు శనివారం అమెరికాలోని అట్లాంటా నగరంలో జరగనున్నాయి. ఇందుకు ఆయన అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి అమెరికాలోని వివిధ నగరాల్లో ఉన్న వైఎస్ అభిమానులు హాజరు కానున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనడానికి తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు తరలి వెళుతున్నారు.
వైఎస్సార్‌సీపీ ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రాజన్న దొర, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్, ఆళ్ల రామకృష్ణారెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, నేతలు అంబటి రాంబాబు, చలమలశెట్టి సునీల్, గుడివాడ అమర్‌నాథ్, భూమన కరుణాకరరెడ్డి ఈ వేడుకలకు హాజరుకానున్నారు.
0 comments:
Post a Comment