చంద్రబాబు సర్కారుకు 4 రోజుల టైమ్ ఇస్తున్నాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు సర్కారుకు 4 రోజుల టైమ్ ఇస్తున్నాం

చంద్రబాబు సర్కారుకు 4 రోజుల టైమ్ ఇస్తున్నాం

Written By news on Thursday, July 23, 2015 | 7/23/2015


'చంద్రబాబు సర్కారుకు 4 రోజుల టైమ్ ఇస్తున్నాం'
అనంతపురం: మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర బంద్ చేపడతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు. 14 రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నా చంద్రబాబుకు కనిపించలేదా అని ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర చేస్తున్న ఆయన మున్సిపల్ కార్మికుల సమ్మెపై స్పందించారు.

చంద్రబాబు ప్రభుత్వానికి 4 రోజుల సమయం ఇస్తున్నామని, ఈలోపు స్పందించకుంటే రాష్ట్రవ్యాప్త బంద్ చేపడతామన్నారు. శుక్రవారం జరిగే మున్సిపల్ కార్మికుల కలెక్టరేట్ల ముట్టడికి వైఎస్సార్ సీపీ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పుట్టపర్తిలో మున్సిపల్ కార్మికుడు వెంకయ్య గుండెపోటుతో మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు పెంచమంటే ఉక్కుపాదంతో అణచివేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.

కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి తప్పడం న్యాయమా అని ప్రశ్నించారు. కార్మికుల వేతనాలు పెంచితే రూ.200  నుంచి రూ. 300 కోట్లు భారం పడుతుందన్నారు. కార్మికుల సమ్మెపై ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. సింగపూర్ బృందానికి రెడ్ కార్పెట్ పరిచే చంద్రబాబుకు కార్మికుల సమస్యలు పట్టవా అని ప్రశ్నించారు. మున్సిపల్ కార్మికుల సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని వైఎస్ జగన్ తెలిపారు.
Share this article :

0 comments: