నిస్సిగ్గుగా ఓటర్లను కొనుగోలు చేసి.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నిస్సిగ్గుగా ఓటర్లను కొనుగోలు చేసి..

నిస్సిగ్గుగా ఓటర్లను కొనుగోలు చేసి..

Written By news on Wednesday, July 8, 2015 | 7/08/2015


డబ్బు సంచులతో గెలిచారు
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై వైఎస్ జగన్
కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఎలా గెలిచారో బాబు చెప్పాలి
భూమాను అక్రమంగా అరెస్టు చేశారు.. నిమ్స్‌కు తరలించకుండా బాబు అడ్డుకుంటున్నారు
భూమాకు ఏదైనా జరిగితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి

 
కర్నూలు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ డబ్బుసంచులతో ఓటర్లను కొనుగోలు చేసి అక్రమ విజయం సాధించిందని  వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దుయ్యబట్టారు. తమ పార్టీకి తగిన బలంలేని చోట తాము అభ్యర్థులనే నిలబెట్టలేదన్నారు. కానీ చంద్రబాబు మాత్రం టీడీపీకి బలం లేకపోయినా అభ్యర్థులను పోటీలో నిలబెట్టి నిస్సిగ్గుగా ఓటర్లను కొనుగోలు చేసి అక్రమంగా విజయం సాధించారని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అక్రమ కేసులో అరెస్టయి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని పేయింగ్ బ్లాక్‌లో మూడు రోజులుగా చికిత్స పొందుతున్న  పీఏసీ చైర్మన్, నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డిని జగన్ మంగళవారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘సీఎం చంద్రబాబు లంచాల రూపంలో ఏపీలో సంపాదించిన సొమ్ముతో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడానికి 8 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించారు. ఒక్కొక్కరికి రూ. 5 కోట్ల నుంచి రూ. 20 కోట్ల చొప్పున సుమారు రూ. 150 కోట్లు ఎరచూపారు. ఇప్పుడు ఇక్కడా అదే పని చేశారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లను సైతం వదలకుండా ఒక్కొక్కరికి రూ. 15 లక్షలు ఇచ్చి కొనుగోలు చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి అదే గొప్ప విజయంగా సంబరాలు చేసుకోవడం సిగ్గుమాలిన చర్య. కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ బీ-ఫారంపై గెలిచిన ఓటర్లే ఎక్కువ. ఈ రెండుచోట్ల బలం లేకపోయినా అధికారపార్టీ ఎలా గెలవగలిగిందో చంద్రబాబు సమాధానం చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. సుమారు అరగంటపాటు భూమా దగ్గరే ఉన్న జగన్.. ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆయన కుటుంబసభ్యుల్ని పలుకరించారు.  

భూమా అరెస్టు అక్రమం
ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూనీ చేసి భూమాను అక్రమంగా అరెస్టు చేశారని జగన్ విమర్శించారు. నంద్యాల బూత్‌లో ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, అఖిలప్రియలు తమ ఓటు హక్కును వినియోగించడానికి వెళ్లినప్పుడు చంద్రబాబు ఆదేశాల మేరకు పోలీసులు కావాలనే అఖిలప్రియను దుర్భాషలాడారని చెప్పారు. ‘‘అది తెలిసి... ఏమయ్యా ఇలా చేశారని భూమా ప్రశ్నిస్తే ఆయన్ను బలవంతంగా పక్కకు తోశారు. ఈ సందర్భంలో ఆయన ‘డోంట్ టచ్ మి’ అన్న ఒక్క పదాన్ని పట్టుకుని ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి.. చివరకు ఆయనకు బె యిల్ రాకుండా ఇబ్బందులు పెడుతున్నారు. సర్కారు చేస్తున్న దౌర్జన్యాలు, అన్యాయాల్ని దేవుడు చూస్తున్నాడు. ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు చంద్రబాబును బంగాళాఖాతంలో కలిపే రోజు అతి త్వరలోనే ఉంది’’ అని హెచ్చరించారు.
 
భూమాకు ఏమైనా జరిగితే..
అనారోగ్యంతో బాధపడుతున్న నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డికి ఏదైనా జరిగితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని జగన్  హెచ్చరించారు. ‘‘భూమాకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. బీపీ, షుగరూ ఉంది. బాబుకు ఇది తెలుసు. అయినా భూమాను ఇబ్బందులు పెడుతున్నారు. ఆయన జీవితంతో చెలగాటమాడుతున్నారు. మెరుగైన వైద్య చికిత్సల కోసం భూమాను నిమ్స్‌కు తరలించాలని డాక్టర్లు చెబుతుంటే.. పక్క రాష్ట్రంలోని నిమ్స్‌కు మేమెందుకు పంపాలంటున్నారు. బాబును సూటిగా అడుగుతు న్నా... హైదరాబాద్‌లో మీ నివాసం ఉండొచ్చు.. హైదరాబాద్‌లో మీ ఓటు ఉండొచ్చు.. అక్కడ సెక్షన్-8 అమలు చేయలేదని గొడవ చేయొచ్చు.. కానీ ఒక ఎమ్మెల్యే ఆరోగ్యం మిషమిస్తే.. డాక్టర్లు నిమ్స్‌కు తరలించాలని రెఫర్ చేస్తే.. అక్కడకు పంపడానికి మనస్సురాదు’’ అని ఆయన విమర్శించారు.
Share this article :

0 comments: