ఆధార్ అంటే ఖబడ్దార్ అన్నావ్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆధార్ అంటే ఖబడ్దార్ అన్నావ్

ఆధార్ అంటే ఖబడ్దార్ అన్నావ్

Written By news on Tuesday, July 7, 2015 | 7/07/2015


ఆధార్ అంటే ఖబడ్దార్ అన్నావ్
 ఆధార్ అంటేనే ఖబడ్దార్ అని ఎన్నికల ముందు కాకిగోల చేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే పథకాలన్నింటినీ ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలని చెప్పడం మోసపూరితమేనని వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. పార్టీ ఏపీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పేద, బడుగు వర్గాల ప్రజల కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచేందుకే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆధార్‌తో అన్ని పథకాలను అనుసంధానం చేయాలనే నిర్ణయం తీసుకున్నారన్నారు.

వైఎస్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల వల్ల ఎక్కువగా లబ్ది పొందింది దళిత, బడుగు, బలహీన వర్గాలేనని అలాంటి వారికి ఈ నిర్ణయంతో చంద్రబాబు ద్రోహం తలపెట్టారని ఆయన విమర్శించారు. సబ్సిడీ బియ్యం పంపిణీతోనూ గ్యాస్ సరఫరాతోనూ ఆధార్‌కు లింకు పెడతామని ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినపుడు ఈ విధానంపై తీవ్ర అభ్యంతరం తెలుపుతూ చంద్రబాబు మాట్లాడిన పత్రికా క్లిప్పింగులను నాగార్జున విలేకరులకు చూపారు.

ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒక మాట, అధికారంలో ఉన్నపుడు మరో మాట మాట్లాడ్డం చంద్రబాబు నైజమని ఆయన దుయ్యబట్టారు. ఆధార్‌ను పథకాలకు ప్రాతిపదికగా తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఖాతరు చేయకుండా చంద్రబాబు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారన్నారు.
 
జగ్జీవన్‌రామ్‌కు నివాళి
బాబూ జగ్జీవన్‌రామ్ వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఘనంగా నివాళులర్పించారు. జగ్జీవన్‌రామ్ చిత్రపటాన్ని ఉంచి నేతలందరూ పుష్పాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఏపీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున, పార్టీ నేతలు వి.విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కొండా రాఘవరెడ్డి, చందోలు డేవిడ్ విజయ్‌కుమార్ తో సహా పలువురు పాల్గొన్నారు. నాగార్జున మాట్లాడుతూ ఒక దళిత నేతగా జగ్జీవన్‌రామ్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు.
Share this article :

0 comments: