పాపం..ప్రభుత్వానిదే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పాపం..ప్రభుత్వానిదే

పాపం..ప్రభుత్వానిదే

Written By news on Wednesday, July 15, 2015 | 7/15/2015


పాపం..ప్రభుత్వానిదే
- ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
- వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీలు
తిరుపతి రూరల్:
 ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పవిత్ర పుష్కరాల్లో 27 మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని, ఆ పాపం ప్రభుత్వనిదేనని వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. గోదావరి పుష్కరాల్లో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి తుమ్మలగుంటలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. తుమ్మలగుంట లోని చాముండేశ్వరీ దేవి ఆలయం సర్కిల్ నుంచి తెలుగుతల్లి విగ్రహం వరకు సాగిన ఈ ర్యాలీలో ఎస్సీ సెల్ నాయకులు, విద్యార్థులు, ఎమ్మెల్యే చెవిరెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షలాది మంది భక్తుల వస్తారని ముందుగానే తెలిసినా అందుకు తగిన ఏర్పాట్లను ఘాట్‌ల వద్ద ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. భక్తులు కూడా సంయమనం పాటించి పవిత్ర పుష్కర స్నానలను చేయాలని సూచించారు. తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తొక్కిసలాటకు భధ్యత వహించి సీఎం చంద్రబాబు రాజీనామా చేయాలని ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దామినేటి కేశవులు డిమాండ్ చేశారు. పుష్కరాల ఏర్పాట్లలో వందల కోట్ల అవినీతి జరిగిందని, ఏర్పాట్లు నాసిరకంగా చేయడంతోనే 27 మంది మృతి చెందారని ఆరోపించారు. భారీకేడ్లను పటిష్టంగా ఏర్పాటు చేసి ఉంటే అంత పెద్ద మొత్తంలో ప్రాణనష్టం జరిగి ఉండేది కాదన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లారపు వాసు, చాట్ల భానుప్రకాష్, ఎస్సీ సెల్ రూరల్ అధ్యక్షుడు వెంకటరమణ, పొన్నయ్య, సూరి, లోకనాథం పాల్గొన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యమే  
యూనివర్సిటీక్యాంపస్: రాజమండ్రిలో మంగళవారం ప్రారంభమైన పుష్కరాల్లో 27 మంది మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని వైఎస్సార్ సీపీ  విద్యార్థి విభాగం ఆరోపించింది. రాజమండ్రిలోని గోదావరి పుష్కరఘాట్‌లో జరిగిన తొక్కిసలాట సందర్భంగా మరణించిన 27 మంది ఆత్మ శాంతి కోసం మంగళవారం రాత్రి ఏడుగంటలకు తిరుపతిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు వి.హరిప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ వెస్ట్ చర్చి నుంచి ఎంఆర్‌పల్లి కూడలి వరకు సాగింది. ఎంఆర్‌పల్లి కూడలిలో పుష్కర మృతులకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా హరిప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్లక్ష్యం, సరైన ఏర్పాట్లు  చేయకపోవడం వల్ల  తొక్కిసలాట  జరిగి భక్తులు మరణించారన్నారు. 144 సంవత్సరాలకోసారి వచ్చే  మహాపుష్కరాలపై ప్రభుత్వం విపరీతమైన ప్రచారం చేయడంతో ఎక్కువమంది పుష్కర స్నానాల కోసం రాజమండ్రికి తరలివచ్చారన్నారు. చంద్రబాబు వీఐపీ ఘాట్‌కు వెళ్లకుండా, సాధారణ పుష్కరిణి ఘాట్‌కు వెళ్లారన్నారు. దీంతో సాధారణ భక్తులను ఐదు గంటలపాటు క్యూలోనే ఉంచి, ఒక్కసారిగా వదలడంతోనే తొక్కిసలాట జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హేమంత్‌యాదవ్, క్యాంపస్ అధ్యక్షుడు మురళీధర్, నాయకులు హేమంత్‌రెడ్డి, కిషోర్‌కుమార్, సుధీర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, మౌళాళి, రామాంజనేయులు, నవీన్, అంజన్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: