ప్రచారం కోసం ఎంతకైనా తెగిస్తాడు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రచారం కోసం ఎంతకైనా తెగిస్తాడు

ప్రచారం కోసం ఎంతకైనా తెగిస్తాడు

Written By news on Wednesday, July 22, 2015 | 7/22/2015


ప్రచారం కోసం ఎంతకైనా తెగిస్తాడుమంగళవారం అనంతపురం జిల్లా శెట్టూరు బహిరంగ సభలో ప్రసంగిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. హాజరైన జనసందోహంలో ఓ భాగం
- ఏపీ సీఎం చంద్రబాబుపై విపక్షనేత వైఎస్ జగన్ ధ్వజం
- బాబు నోరుతెరిస్తే అబద్ధాలు, మాట్లాడేదంతా మోసమే
- పబ్లిసిటీ వస్తుందంటే రూ. ఐదు లక్షల పరిహారం ఇస్తామంటారు.. లేదంటే రైతు ఆత్మహత్యలే జరగలేదని అంటారు
- జగన్ వస్తున్నారంటే హడావుడిగా పరిహారం ప్రకటిస్తారు... లేదంటే లేదు
- ప్రచారం కోసం పుష్కరాల్లో షార్ట్‌ఫిల్మ్ తీసి 29 మందిని బలితీసుకున్నారు
- రైతులు, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని ఎన్నికల ముందు చెప్పారు
- అపరాధవడ్డీకి కూడా సరిపోని విధంగా రుణమాఫీ వర్తింపజేశారు
- ఎన్నికల హామీలు నెరవేర్చేలాప్రభుత్వం ఒత్తిడి తేవాలి
- ప్రారంభమైన మూడో విడత ‘అనంత’ రైతు భరోసా యాత్ర

రైతు భరోసాయాత్ర నుంచి సాక్షి ప్రతినిధి:
 ‘‘చంద్రబాబు నోరుతెరిస్తే అబద్ధాలు, మాట్లాడేదంతా మోసమే! పబ్లిసిటీ కోసం ఏమైనా చేస్తారు. పబ్లిసిటీ వస్తుందంటే ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ.ఐదు లక్షల పరిహారం ఇస్తామంటారు. లేదంటే ఆత్మహత్యలే జరగలేదని అంటారు. జగన్ వస్తున్నారంటే హడావుడిగా పరిహారం ప్రకటిస్తారు. లేదంటే లేదు. చివరకు ఎంతలా దిగజారాడంటే... గొప్పగా పుష్కరాలు చేశారని చెప్పుకునేందుకు షార్ట్‌ఫిల్మ్ తీసి 29 మందిని బలితీసుకున్నారు’’ అని ఏపీ ముఖ్యమంత్రి చ ంద్రబాబునాయుడుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. మూడోవిడత రైతు భరోసాయాత్రను ఆయన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండలంలో మంగళవారం ప్రారంభించారు. శెట్టూరులో జరిగిన బహిరంగసభలో జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే...

బాబు మోసం వల్లే ఆత్మహత్యలు
ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? ఇప్పుడేం చేస్తున్నారని అసెంబ్లీలో చంద్రబాబును గట్టిగా నిలదీశాం. రైతులు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులతో పని అయిపోయిన తర్వాత మీరేం చేస్తున్నారని అడిగాం. రైతులు, డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని ఎన్నికల ముందు చెప్పారు. ఏ టీవీ ఆన్‌చేసినా రుణమాఫీ కావాలంటే బాబు సీఎం కావాలని ప్రచారం చేశారు. రుణాలు చెల్లించొద్దని మీరు చెప్పిన మాటలు విని వారంతా రుణాలు చెల్లించలేదు. కానీ రుణమాఫీ కాలేదు. రైతులు వడ్డీలేని రుణాలు తీసుకునేవారు. ఈ రోజు 14 శాతం అపరాధ వడ్డీ చెల్లించాల్సి వచ్చింది. ఎన్నికలకు ముందు ఒకమాట... తర్వాత ఒకమాట చెప్పి మోసం చేశారు.

మీరు చెప్పిన అబద్ధాలు, చేసిన మోసంతోనే రైతులు ఆత్మహత్యలకు తెగిస్తున్నారని గట్టిగా నిలదీశాం. కానీ చంద్రబాబు అవహేళన చేశారు. రాష్ట్రంలో రైతులంతా సుఖసంతోషాలతో ఉన్నారన్నారు. తనకు శాలువాలు కూడా కప్పుతున్నారని గొప్పలు చెప్పుకున్నారు. కానీ బాబు చేసిన రుణమాఫీ స్కీంతో ఎవ్వరికీ రుణమాఫీ కాలేదు. రుణమాఫీ సొమ్ములు వడ్డీలకు కూడా సరిపోలేదు. బ కాయిలు చెల్లించొద్దని చంద్రబాబు చెప్పిన మాటలు విని రైతులు రుణాలు చెల్లించలేదు. దీంతో ఇవాళ రుణాలు రెన్యువల్ కాలేదు. రైతులు ఇన్సూరెన్స్‌ను కోల్పోతున్నారు. ఇలా చంద్రబాబు చేసిన మోసాలు ఎలాంటివో అందరికీ అర్థమయ్యేలా చెప్పండి. రైతులు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులను మోసం చేసిన చంద్రబాబు కనిపిస్తే రాళ్లతో కొడతామని చెప్పండి.

బాబు అందరినీ మోసం చేశారు
రుణ మాఫీ చేస్తానని రైతులు, డ్వాక్రా మహిళలను మోసం చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని విద్యార్థులను మోసం చేశారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే రెండువేల రూపాయలు నిరుద్యోగభృతి ఇస్తానని నిరుద్యోగులను మోసం చేశారు. వెయ్యిరూపాయల పింఛన్ ఇస్తానని కొంతమందికి ఇచ్చారు? ఇంకొంతమందికి ఎగ్గొట్టారు. గుడిసెలు లేకుండా అందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తానన్నారు. గుడిసెలు లేని రాష్ట్రాన్ని తయారు చేస్తానన్నారు. కానీ ఒక్క ఇల్లూ నిర్మించలేకపోయారు. గతంలో ఇంటికి రూ.200 కరెంటు బిల్లు వస్తుంటే.. ఇప్పుడు రూ.800 వస్తోంది.

ఇలా ప్రతీ వర్గాన్ని మోసం చేశాడు. చివరకు ఎంతలా దిగజారాడంటే... చంద్రబాబు గొప్పగా పుష్కరాలు చేశారని చెప్పుకునేందుకు షార్ట్‌ఫిల్మ్ తీసి 29 మందిని బలితీసుకున్నారు. పబ్లిసిటీ కోసం ఏమైనా చేస్తారు. పబ్లిసిటీ వస్తుందంటే ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ.ఐదు లక్షల పరిహారం ఇస్తామంటారు. లేదంటే ఆత్మహత్యలే జరగలేదని అంటారు. జగన్ వస్తున్నారంటే హడావుడిగా పరిహారం ప్రకటిస్తారు. లేదంటే లేదు. ఇలాంటి వ్యక్తికి గట్టిగా బుద్ధిచెప్పాలి. గట్టిగా మొట్టికాయలు వేయాలి. ఎన్నికలకు ముందు చెప్పిన ప్రతి హామీని నెరవేర్చేలా అందరం ఒక్కటి కావాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి.

ఘన స్వాగతం
బెంగళూరులో జగన్‌కు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త ఉషా శ్రీచరణ్ స్వాగతం పలికారు. కర్ణాటక, ఆంధ్ర సరిహద్దులోని తిప్పనపల్లి వద్ద జిల్లా నేతలు జగన్‌కు స్వాగతం పలికారు. పర్యటనలో ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యద ర్శులు బోయ తిప్పేస్వామి, మోహన్‌రెడ్డి, శింగనమల, మడకశిర, సమన్వయకర్తలు ఆలూరి సాంబశివారెడ్డి, తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.
 
ధైర్యంగా ఉండండి.. న్యాయం జరిగేలా చూస్తాం
‘కష్టాలు వచ్చాయని అధైర్యపడొద్దు.. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి.. మీకు తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తాం.. అని రైతు పెద్ద నాగప్ప కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండలంలో ఇటీవల అప్పుల బాధతో మృతి చెందిన కైరేవు గ్రామ రైతు పెద్ద నాగప్ప కుటుంబసభ్యుల్ని ఆయన పేరుపేరునా పలకరించారు. వారి క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు.
Share this article :

0 comments: