వైఎస్ షర్మిల నేటి పర్యటన ఇలా... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ షర్మిల నేటి పర్యటన ఇలా...

వైఎస్ షర్మిల నేటి పర్యటన ఇలా...

Written By news on Thursday, July 2, 2015 | 7/02/2015

తాండూరు : పరామర్శ యాత్రలో భాగంగా వైఎస్ షర్మిల గురువారం వికారాబాద్ నియోజకవర్గం నుంచి పర్యటించనున్నారు.

* ఉదయం తాండూరు నుంచి బయలుదేరి నేరుగా మర్పల్లి మండలానికి చేరుకుంటారు. అక్కడ కమ్మరి నారాయణ కుటుంబ సభ్యులను కలుసుకుంటారు.
* అక్కడ నుంచి మోమిన్ పేటకు చేరుకుని అరిగె యాదయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు.
*చివరగా మోమిన్ పేట మండలం ఎన్కతలలోని ఆలంపల్లి వెంకటేశం కుటుంబాన్ని కలుసుకుంటారు. అనంతరం లోటస్ పాండ్ కు పయనమవుతారు.

కాగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణ వార్తను జీర్ణించుకోలేక రంగారెడ్డి జిల్లాలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ షర్మిల  గత నెల 29 నుంచి మలివిడత యాత్రను చేపట్టిన విషయం తెలిసిందే.
Share this article :

0 comments: