సమస్యల పరిష్కారానికి చొరవ చూపండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సమస్యల పరిష్కారానికి చొరవ చూపండి

సమస్యల పరిష్కారానికి చొరవ చూపండి

Written By news on Sunday, July 19, 2015 | 7/19/2015


సమస్యల పరిష్కారానికి చొరవ చూపండి
తమిళనాడులో తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని తమిళనాడు తెలుగు యువశక్తి ప్రతినిధులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు.  తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలోని బృందం శనివారం హైదరాబాద్‌లో జగన్‌ను కలిసింది. తమిళనాడులో సుమారు 40శాతం మంది తెలుగు ప్రజలు స్థిరపడ్డారని, వారికి భాషాపరంగా ఎదురవుతున్న ఇబ్బందులను సమస్యలను వివరించారు.

తెలుగు ప్రజలు అధికంగా నివసించే ప్రాంతాల్లో తెలుగులో విద్యా బోధనకు అవకా శం కల్పించాలని, రెండవ అధికార భాషగా గుర్తించేందుకు కృషి చేయాలని కోరారు. త్వరలో చెన్నై, హొసూరు, తిరువళ్లూరు జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న మహానేత వైఎస్ విగ్రహాల ఆవిష్కరణకు హాజరు కావాలని జగన్‌ను కోరారు.
Share this article :

0 comments: