ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు

ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు

Written By news on Wednesday, July 8, 2015 | 7/08/2015


ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు
 వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

 పిడుగురాళ్ళ : ప్రజల సొమ్మును టీడీపీ శాసనసభ్యులు దోచుకుంటుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారిని ఆశీర్వదిస్తుండటం టీడీపీ దౌర్జన్యకాండకు పరాకాష్ట అని వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. పిడుగురాళ్లలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి మంగళవారం హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు బెల్టు షాపులు తీసేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు రాష్ట్రంలో ఒక్క బెల్టు షాపు మూయించకపోగా నూతన మద్యం విధానాన్ని ప్రవేశపెట్టి పాల కేంద్రంలో పాల ప్యాకెట్ల మాదిరిగా మద్యాన్ని అందిస్తున్నారని మండిపడ్డారు.

ఈ మద్యం షాపులు హైవేలు, మాల్స్‌లో నిర్వహించి రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా చూడడం దారుణమన్నారు. లాటరీలో మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులకు తప్పనిసరిగా వాటా ఇవ్వాల్సిందేనని, ఇవ్వకుంటే మద్యం వ్యాపారం చేయనివ్వమని శాసించడం వారి దౌర్జన్యానికి పరాకాష్ట అన్నారు. జిల్లాలో ముఖ్యంగా సత్తెనపల్లి, నర్సరావుపేట, గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో ఈ విధమైన పరిస్థితి కొనసాగుతుందన్నారు. ఎక్సైజ్ అధికారులు సైతం దుకాణాలు పొందిన వారిని పిలిపించి ఎమ్మెల్యేలకు వాటాలు ఇవ్వాలని ఒత్తిడి తీసుకురావడం దారుణమన్నారు.

నీరు-చెట్టు ద్వారా మట్టిని తవ్వుకుని డబ్బు సంపాదించుకుని తిరిగి తవ్విన మట్టికి ఇరిగేషన్ అధికారుల నుంచి క్యూబిక్ మీటరుకు రూ.29 చొప్పున వసూలు చేసి కార్యక్రమాన్ని అవినీతిమయం చేశారని ఆరోపించారు.  నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ ద్వా రా లక్షలు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఏడాది కాలంలో దొరికినంత దో చుకుని అభివృద్ధిని అటకెక్కించారన్నా రు. సమావేశంలో రాజుపాలెం జెడ్పీటీసీ మర్రి వెంకటరామిరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి కొఠా రి నరసింహారావు, వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనర్ చింతా వెంకట రామారావు, మండల కన్వీనర్ చల్లా పిచ్చిరెడ్డి, రాష్ట్ర బీసీ విభాగం ప్రధాన కార్యదర్శి కుందు ర్తి గురవాచారి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: