అడుగడుగునా బ్రహ్మరథం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అడుగడుగునా బ్రహ్మరథం

అడుగడుగునా బ్రహ్మరథం

Written By news on Thursday, July 2, 2015 | 7/02/2015

అనురాగం.. ఆత్మీయతల నడుమ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర మూడోరోజు కొనసాగింది. చేవెళ్ల, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో పర్యటించిన షర్మిలకు జనం అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. బుధవారం నాలుగు కుటుంబాలను ఆమె కలుసుకున్నారు. ‘మీకు నీనున్నానంటూ’ భరోసా ఇచ్చారు. తాండూరులో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఆమెతో కరచాలనం చేసేందుకు మహిళలు పోటీపడ్డారు. మొయినాబాద్ మండలం ఎన్కేపల్లిలో పాఠశాల విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు.
 
- భరోసా ఇచ్చిన వైఎస్ తనయ
- సుగుణ కుటుంబానికి పరామర్శ
- ఉద్వేగానికిలోనైన కుటుంబసభ్యులు
- కంటతడిపెట్టిన వైనం
- ఓదార్చిన షర్మిల
చేవెళ్ల/మొయినాబాద్ రూరల్:
 ‘వైఎస్ రాజశేఖరరెడ్డి మరణవార్త విన్న మా అమ్మ అదేరోజు చనిపోయింది. వైఎస్ అంటే మా అమ్మకు విపరీతమైన అభిమానం ఉండేది. ఆరు సంవత్సరాల తర్వాత మా కు టుంబాన్ని కూడా గుర్తుపెట్టుకొని ఓదార్చడం తో ఉద్విగ్నానికి లోనయ్యాం. మీరాక మాకు సంతోషాన్ని కలిగించింది. మీరు మా ఇంటికి రావడం గొప్ప అనుభూతిని కలిగించింది’ అని సుగుణ కుటుంబసభ్యులు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన మొయినాబాద్ మం డలంలోని ఎన్కేపల్లి గ్రామంలో ఈడిగ సుగుణ కుటుంబాన్ని షర్మిల బుధవారం పరామర్శిం చారు. ఉదయం 11 గంటలకు ఎన్కేపల్లిలోని సుగుణ ఇంట్లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

షర్మిలను చూసి కుటుంబసభ్యులు ఉద్విగ్నానికి లోనయ్యారు. అనంతరం సుగుణ కుమారుడు ఈడి గ రాజప్రవీణ్, కుమార్తె సల్వ పుష్పరాజ్, బిం దు ప్రియదర్శిని, కోడలు జీవామణి, మనుమరాళ్లు ప్రేజీ, సంజన, మనవడు పార్థును ఆమె పరిచయం చేసుకున్నారు. మీ అమ్మ ఎలా చని పోయిందని, మీ నాన్న ఏం చేస్తుంటాడని కు టుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. మా నాన్న చిన్నప్పుడే మమ్మల్ని వదిలి వెళ్లిపోతే.. అన్నీ తానై మా అమ్మే మాకు చదువు చెప్పిం చింది. కష్టపడి మాకు కూడా పెళ్లిళ్లు చేసింది. మా అమ్మకు వైఎస్సార్ అంటే మహాప్రాణం. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు గ్రామంలో మహిళలకు, ప్రజలకు తెలియజెప్పేది.
 
మీ స్ఫూర్తితోనే పాఠశాలను నడిపిస్తున్నాం..
ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే వైఎస్ ఆశయం మేరకు.. మీ స్ఫూర్తి, చేయూతతోనే గ్రామంలో మేము ప్రియదర్శిని పేరుతో పాఠశాలను నడిపిస్తున్నాం. మా అమ్మ సుగుణకు కూడా చదువుపై ఆసక్తి ఎక్కువ. అందువల్ల 1999లో పాఠశాలను స్థాపించాం. ప్రస్తు తం 70 మంది వి ద్యార్థులున్న ఈ పాఠశాలలో 30 మంది రెసిడెన్షియల్‌గానూ, మరో 40 మం ది డే స్కాలర్స్‌గా చదువుతున్నారు. ఆడపిల్లలు చదువుకోవాలనేదే అమ్మ ఆశయం. అందువల్ల బాలికల చదువుకు ప్రాధాన్యతనిస్తున్నాం.
 
అమ్మ ఎలా చనిపోయిందంటే..
మా అమ్మ సుగుణ వైఎస్‌కు వీరాభిమాని. సెప్టెంబర్ 2న ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మిస్సయిందని తెలుసుకొని విలవిల్లాడింది. అప్పటినుంచి టీవీ చూస్తూ కూర్చుంది. రోజంతా గడిచినా ఆయన జాడ తెలియకపోవడంతో కంగారు ఎక్కువైంది. మరుసటిరోజు ఉదయం హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ మరణించాడని టీవీ ల్లో వార్తలు రావడంతో కన్నీ టి పర్యంతమైంది. వైఎస్ మరణాన్ని జీర్ణించుకోలేక అదే రోజురాత్రి గుండె ఆగి చనిపోయిందని కన్నీటిపర్యంతమయ్యారు.

మీ కుటుంబాలు బాగుండాలి..

దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఇంత అభిమానం చూపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. మీ కుటుంబాలు బాగుండాలి. ఏ ఆపద వ చ్చినా నాకు ఫోన్‌చేయండి. నేను మీకు అం డగా ఉంటా. మీకు చేయూతనిస్తామని వైఎస్ తనయ షర్మిల తెలిపారు. సుగుణ కుటుంబసభ్యులను ఓదార్చి వారికి భరోసా కల్పించారు. షర్మిలకు కుటుంబసభ్యులు స్వీట్లు తినిపిం చారు. కార్యక్రమంలో తెలంగాణ వైఎస్సార్ సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి శివకుమార్, జిల్లా అధ్యక్షుడు సురేష్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు భీష్మ రవీందర్, రాష్ట్ర నాయకులు సయ్యద్ ముజ్‌తబా, అమృతాసాగర్, ప్రధాన కార్యదర్శి గాదె నిరంజన్‌రెడ్డి, సునీల్‌కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు పి.నాగిరెడ్డి, మొయినాబాద్ మండల అధ్యక్షుడు రాజయ్య, ఎనికెపల్లి సర్పంచ్ అమర్‌నాథ్‌రెడ్డి, చేవెళ్ల పార్లమెంటు ఎస్సీ సెల్ అధ్యక్షుడు జే.భీమయ్య, పార్టీ నాయకులు వెంకటేశ్‌యాదవ్, శివారెడ్డి, మందడి వెంకట్‌రెడ్డి, మెల్గు శ్రీనివాస్‌గౌడ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

గోటిగకుర్ధులో..

తాండూరు: మీకు ఏ కష్టమొచ్చినా మేమున్నాం. అధైర్యపడొద్దు.. అంటూ వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఆత్మవిశ్వాసం కలిగించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని, ఆ కోరిక నెరవేరకపోవడంతో ప్రాణాలు వదిలిన తాండూరు డివిజన్ గోటికగుర్ధుకు చెందిన అవుసుల లక్ష్మయ్యచారి కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. మూడోరోజు పరామర్శ యాత్రలో భాగంగా లక్ష్మయ్యచారి కుటుంబాన్ని కలిశారు. లక్ష్మయ్యచారి కొడుకు జగన్నాథ్‌చారి, కోడలు రేణుక, కూతుళ్లు జగదాంబ, లక్ష్మితోపాటు అల్లుడు రాములు ఇతర కుటుంబ సభ్యులను షర్మిల ఆప్యాయంగా పలకరించారు. లక్ష్మయ్యచారి ఎలా చనిపోయారు? ఎందుకు చనిపోయారు? తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు.

వైఎస్ అంటే నాన్నకు ఎంతో ప్రే మ అని లక్ష్మయ్యచారి కూతుళ్లు జగదాంబ, లక్ష్మి షర్మిలకు వివరించారు. కళ్ల ముందే ఒంటికి నిప్పంటించుకొని జగన్ సీఎం కావాలని కేకలు వేస్తూ నాన్న ప్రాణాలు వదిలారని చిన్నకూతురు జగదాంబ ఏడుస్తూ షర్మిలకు వివరిం చారు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలని దే వున్ని ప్రార్థించేవాడు. ఆ కోరిక నెరవేకపోవడంతో ఒంటిపై నిప్పంటించుకొని తన తండ్రి ప్రాణాలు విడిచారని లక్ష్మ్యచారి కూతుళ్లు కన్నీటి పర్యంతమయ్యారు.

తన సోదరుడు జగన్నాథ్, తమకు పెద్ద దిక్కు మా తండ్రి లేకపోవడంతో మా కుటుంబం కష్టాలు పడుతున్నదని వాపోయారు. వారి కష్టాలు విన్న షర్మిల చలించిపోయారు. ఎలాంటి సహాయం కావాలన్నా తనకు ఫోన్ చేయాలని షర్మిల సూచించారు. వైఎస్‌ఆర్ సీపీ తెలంగాణ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి లక్ష్మయ్యచారి కుటుంబాన్ని ఓదార్చారు. మొదట షర్మిల లక్ష్మయ్యచారితోపాటు దివంగత నేత వైఎస్ చిత్రపటాలకు పూలతో నివాళులర్పించారు. లక్ష్మయ్యచారి కూతుళ్లు, కోడలు జగదాంబ, లక్ష్మి, కోడలు రేణుక షర్మిలకు చేతికి గాజులు తోడిగి, పండ్లు, పూలు అందించారు. ఆమె పాదాభివందనం చేయబోతుండగా షర్మిల వద్దని వారించారు.
Share this article :

0 comments: