బాబు స్థానంలో ఎవరైనా ఉంటే జైలుకు పంపేవారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు స్థానంలో ఎవరైనా ఉంటే జైలుకు పంపేవారు

బాబు స్థానంలో ఎవరైనా ఉంటే జైలుకు పంపేవారు

Written By news on Wednesday, July 15, 2015 | 7/15/2015

కొవ్వూరు : ఏపీ ముఖ్యమంత్రి కాబట్టి చంద్రబాబు తప్పించుకుంటున్నారు.. ఇదే స్థానంలో ఎవరైనా ఉంటే వారిని జైలుకు పంపేవారని  వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పుష్కరాలలో తొక్కసలాట ఘటనకు సీఎం చంద్రబాబు పూర్తి బాధ్యత వహించాలని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో పుష్కర స్నానం ఆచరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వీఐపీలకు కేటాయించిన ఘాట్లో బాబు పూజలు చేసి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదన్నారు. సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వీఐపీ ఘాట్ లు ఏర్పాటు చేశారని, పబ్లిసిటీ కోసమే సామాన్యుల ఘాట్ లో రెండున్నర గంటలు పుష్కర పూజలు నిర్వహించారని చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు.

బాబు చేసిన తప్పుకు విచారణ పేరుతో అధికారులను బలిచేయాలని చూస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. చంద్రబాబు సీఎం కాబట్టే తప్పించుకుంటున్నారు.. ఇదే స్థానంలో ఎవరైనా ఉంటే జైలుకు పంపేవారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. రాజమండ్రి కోటగుమ్మంలో జరిగిన తొక్కిసలాటలో మంగళవారం 27 మృతిచెందిన విషయం తెలిసిందే.
Share this article :

0 comments: