మహానేతకు కుటుంబ సభ్యుల ఘన నివాళి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మహానేతకు కుటుంబ సభ్యుల ఘన నివాళి

మహానేతకు కుటుంబ సభ్యుల ఘన నివాళి

Written By news on Wednesday, July 8, 2015 | 7/08/2015

కడప : మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 66వ జయంతి వేడుకలు బుధవారం వైఎస్ఆర్ జిల్లా ఘనంగా జరుగుతున్నాయి. మహానేత జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ ఆర్ ఘాట్ వద్ద వైఎస్ఆర్ కు కుటుంబ సభ్యులు ఘన నివాళులు అర్పించారు.  వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి, కుమార్తె వైఎస్ షర్మిల, అల్లుడు బ్రదర్ అనీల్, ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ జయంతి కార్యక్రమానికి మహానేత కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు వైఎస్ఆర్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మహానేత 66 వ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోని వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ అభిమానులు పెద్ద ఎత్తున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
Share this article :

0 comments: