మహిళా మంత్రులు గాడిదలు కాస్తున్నారా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మహిళా మంత్రులు గాడిదలు కాస్తున్నారా?

మహిళా మంత్రులు గాడిదలు కాస్తున్నారా?

Written By news on Sunday, July 26, 2015 | 7/26/2015


మహిళా మంత్రులు గాడిదలు కాస్తున్నారా?
హైదరాబాద్ :
వైఎస్సార్‌సీపీ నేత ఆర్.కె.రోజా డిమాండ్
కేసును నీరుగార్చుతోందని ప్రభుత్వంపై ఆగ్రహం

సాక్షి, హైదరాబాద్: నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అందువల్ల హైకోర్టు సుమోటోగా జోక్యం చేసుకుని దర్యాప్తునకు ఆదేశించాలని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్.కె.రోజా డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, తహసీల్దార్ వనజాక్షిపై దాడి, రిషితేశ్వరి ఆత్మహత్య ఉదంతాల్లో వారిద్దరికీ న్యాయం జరగడం లేదని ధ్వజమెత్తారు.

ఆమె శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రిషితేశ్వరి మరణంపై ప్రభుత్వంగానీ, విద్యాశాఖ మంత్రిగానీ పట్టించుకోలేదన్నారు. వనజాక్షికి, రిషితేశ్వరికి అన్యాయం జరుగుతూవుంటే.. మంత్రివర్గంలో ఉన్న ముగ్గురు మహిళా మంత్రులు మౌనంగా ఉండటం సిగ్గుచేటని, వారేం చేస్తున్నారు, గాడిదలు కాస్తున్నారా? అని రోజా ఆగ్రహం వెలిబుచ్చారు. రిషితేశ్వరి ‘సూసైడ్’ నోట్ చూసినవారికి కళ్ల నీళ్లొస్తాయని, కానీ ప్రభుత్వానికి మాత్రం దున్నపోతుపై వర్షం కురిసినట్లుందని మండిపడ్డారు. గోదావరి పుష్కరాల్లో పబ్లిసిటీ పొందడానికి తాపత్రయపడుతున్న చంద్రబాబుకు అమాయక విద్యార్థిని మృతిగురించి పట్టించుకోవాలనే ఆలోచనే లేకపోవడం శోచనీయమన్నారు.

ప్రిన్సిపాల్ పట్టించుకోనందునే..

ర్యాగింగ్ పేరుతో సీనియర్ విద్యార్థులు నరకం చూపిస్తున్నారని రిషితేశ్వరి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చే సినా పట్టించుకోనందునే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని రోజా విమర్శించారు. ఒక ప్రిన్సిపాల్‌గా ఉండి కాలేజీ అమ్మాయిలతో ఎలా డ్యాన్సు చేస్తున్నాడో చూడండంటూ ఫొటోలను ఆమె విలేకరులకు చూపించారు. ప్రిన్సిపాల్‌ను కాపాడేందుకు ప్రభుత్వం పాకులాడుతోందన్నారు. విద్యామంత్రి గంటా శ్రీనివాసరావు సమస్యను పరిష్కరించడానికి చొరవ చూపడం లేదని విమర్శించారు.
Share this article :

0 comments: