ఆదుకుంటామని అభయం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆదుకుంటామని అభయం

ఆదుకుంటామని అభయం

Written By news on Saturday, July 4, 2015 | 7/04/2015

♦ జిల్లాలో రెండోరోజు సాగిన జగన్ పర్యటన
♦ బాధిత మత్స్యకార, గిరిజన కుటుంబాలకు ఓదార్పు
♦ పార్టీ తరఫున ఆదుకుంటామని అభయం
♦ ఆయనపై అడుగడుగునా ఉప్పొం
గిన అభిమానం
 
  కల్లోలితమైన కడలికి బలైన మత్స్యకారుల కుటుంబాల్లో కన్నీటి సంద్రాలే ఎగసిపడుతున్న వేళ.. పెళ్లి ముచ్చట్లను నెమరేసుకుంటూ వెళుతున్న వారిని వెన్నాడిన మృత్యువు సృష్టించిన విషాదం గుండెల్లో పుండై సలుపుతున్న వేళ.. ఓ ఆత్మీయ స్పర్శ వారికి ఉపశమనమైంది. అరుునవారిని పోగొట్టుకున్న దుఃఖం కుంగదీస్తున్న వేళ ఓ అభయం వారికి భరోసానిచ్చింది. వాయుగుండం వేళ సముద్రంలో మరణించిన మత్స్యకారుల కుటుంబాలను, గతనెల 4న రంపచోడవరం వద్ద పెళ్లి వ్యాన్ బోల్తా పడ్డ దుర్ఘటనలో అసువులు బాసిన వారి కుటుంబాలను వైఎస్సార్ సీపీ అధినేత జగన్ అక్కున చేర్చుకుని ఓదార్చారు.
 
 సాక్షి ప్రతినిధి, కాకినాడ : కష్టాల్లో ఉన్న వారి కన్నీళ్లు తుడుస్తూ..జిల్లాలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండవ రోజు పర్యటన శుక్రవారం కొనసాగింది. ఉదయం కాకినాడలో నిర్మల్ జైన్ నివాసం నుంచి బయలుదేరిన దగ్గర నుంచి ఏజెన్సీలో పర్యటన ముగిసే వరకు జగన్‌ను పలకరించేందుకు తరలివచ్చిన వారితో దారులు జనయేరులయ్యూరుు. మత్స్యకార ప్రాంతాలైన పర్లోపేట, పగడాలపేట, ఉప్పలంకల్లో మహిళలు ఆయనపై పూలవర్షం కురిపించేందుకు పోటీ పడ్డారు. అడుగడుగునా ఉప్పొంగిన జనాభిమానానికి  అభివందనం చేస్తూ బాధిత కుటుంబాలను జగన్ అక్కున చేర్చుకున్నారు. అలుపెరగని బాటసారిలా ఉదయం నుంచి రాత్రి వరకు ఎక్కడా విశ్రమించకుండా బాధిత కుటుంబాలకు భరోసానిస్తూ ముందుకు సాగారు. ఎక్కడికక్కడ వెల్లువెత్తిన జనాభిమానంతో జగన్ రాక ఆలస్యమైనా నడినెత్తిన సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నా అభిమాన నేత కోసం దారికిరువైపులా గంటల తరబడి నిరీక్షించడం కనిపించింది.

 కాకినాడ సిటీ, రూరల్ నియోజకవర్గాలతోపాటు రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాల్లోనూ జగన్ పర్యటించారు. ఉదయం కాకినాడలోని నిర్మల్ జైన్ నివాసం నుంచి  పర్యటన ప్రారంభమైంది. తొలుత జైన దేవాలయాన్ని జగన్ సందర్శించారు. మార్వాడీలు ఆయనకు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఇటీవల సముద్రంపై వేటకు వెళ్లి వాయుగుండం ప్రభావంతో మృతిచెందిన తొమ్మిదిమంది మత్స్యకారుల కుటుంబాలను ఓదార్చారు. పర్లోపేటకు చెందిన కంచుమట్ల వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లేదారిలో అడుగడుగునా ప్రజలు పూలవర్షం కురిపిస్తూ అభిమాన నేతను స్వాగతించారు.

వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను సాధకబాధకాలను జగన్ అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడవద్దని, అండగా ఉంటామని భరోసానిచ్చారు. అనారోగ్యంతో ఇటీవల మృతిచెందిన వైఎస్సార్‌సీపీ నేత, మాజీ కార్పొరేటర్ చామకూర ఆదినారాయణ(నాగబాబు) కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. నాగబాబుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కాకినాడ రూరల్‌నియోజకవర్గ పరిధిలోని పగడాలపేట, ఉప్పలంక ప్రాంతాల్లో మత్స్యకార బాధిత కుటుంబాల ప్రతి ఇంటికీ వెళ్లి వారిని ఓదార్చారు. జీవనాధారమైన వేటే అయినవాళ్లను దూరం చేసి అనాథల్ని చేసిందంటూ శోకసంద్రంలో మునిగిన బాధితులను అక్కున చేర్చుకుని ఓదార్చారు.  

 సర్కారు మెడలు వంచైనా సాయం అందిస్తాం..
 ప్రతి ఇంటి వద్దా జగన్ దాదాపు అరగంట సమయం బాధిత కుటుంబాలతో గడిపి  కష్టసుఖాలు తెలుసుకుని కన్నీళ్లు తుడిచారు. ఇంత మంది చనిపోయినా ప్రభుత్వాధినేత చంద్రబాబు స్పందించకపోవడాన్ని జగన్ ఎండగట్టారు. గల్లంతైనవారి ఆచూకీ కనుకొనడంలోగానీ, మృతుల కుటుంబాలకు సాయం అందించడంలో అలసత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం మెడలు వంచైనా సాయం అందేలా చేస్తానని, పార్టీ తరఫున అండగా ఉంటానని బాధితులకు భరోసానిచ్చారు.

సాయంత్రం ఏజెన్సీ పర్యటనకు బయలుదేరిన జగన్‌ను గ్రామగ్రామాన ప్రజలు ఘనంగా స్వాగతించారు. సామర్లకోట, పెద్దాపురంలలో పెద్దాపురం కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు ఆధ్వర్యంలో, జగ్గంపేట, మల్లిసాల వద్ద జెడ్పీ ప్రతిపక్షనేత జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో, ఏజెన్సీలో ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, కో ఆర్డినేటర్ అనంత ఉదయభాస్కర్‌ల ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది.

 గిరిజనుల ఆదరణకు చలించిన జగన్
 పర్యటన సాగిన గ్రామాల పొడవునా జనం జగన్‌ను చూసేందుకు బారులు తీరారు. మధ్యాహ్నం 12 గంటలకే జగన్  ఏజెన్సీకి వెళ్లాల్సి ఉండగా చేరుకునే సరికి అర్ధరాత్రి 12 అయింది. అయినా గిరిజనులు అభిమానంతో నిరీక్షిస్తూ ఉండిపోయారు. జగన్ కూడా మావోయిస్టుల ప్రభావం ఉన్న ఏజెన్సీలో రాత్రి పర్యటన క్షేమం కాదని పోలీసులు అన్నా గిరిజనుల అభిమానానికి స్పందించి పర్యటన కొనసాగించారు. ఎదురు చూసిన వారిని పేరుపేరునా  పలకరించడం వారిలో ఉత్సాహాన్ని నింపింది. తొలుత కొత్తాడ, సూరంపాలెం గ్రామాల్లో వ్యాన్ బోల్తా దుర్ఘటనలో మరణించిన తొమ్మిది మంది కుటుంబాలను పరామర్శించారు.

పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, వంతల రాజేశ్వరి, పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, కాకినాడ పార్లమెంటరీ కో ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్, జెడ్పీ ప్రతిపక్ష నేత జ్యోతుల నవీన్, రాజమండ్రి ఫ్లోర్ లీడర్ షర్మిలా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, కో ఆర్డినేటర్లు చెల్లుబోయిన వేణు, సత్తి సూర్యనారాయణరెడ్డి, వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, గిరజాల వెంకటస్వామినాయుడు, ఆకుల వీర్రాజు, బొంతు రాజేశ్వరరావు, కొండేటి చిట్టిబాబు, గుత్తుల సాయి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, సంగిశెట్టి అశోక్, కర్రి నారాయణరావు, జి.వి.రమణ, వట్టికూటి సూర్యచంద్రశేఖర్, దంగేటి రాంబాబు, తాడి విజయభాస్కరరెడ్డి, ఎం.ఎస్.రాజు, బొబ్బిలి గోవింద్, లింగం రవి, సంయుక్త కార్యదర్శులు పెంకే వెంకట్రావు, యువజన విభాగ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దూలం వెంకన్నబాబు, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, కాకినాడ నగర కన్వీనర్ ఆర్.జె.వి.కుమార్, అనుబంధ విభాగాల అధ్యక్షులు కొల్లి నిర్మల కుమారి, రావిపాటి రామచంద్రరావు, శిరిపురపు శ్రీనివాసరావు, డాక్టర్ యనమదల గీతా మురళీకృష్ణ, జున్నూరి వెంకటేశ్వరరావు, పెట్టా శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు అత్తిలి సీతారామస్వామి, శెట్టిబత్తుల రాజబాబు, అల్లి రాజబాబు, రాజమండ్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మానే దొరబాబు, కాకినాడ మాజీ డిప్యూటీ మేయర్ పసుపులేటి వెంకటలక్ష్మి, వాసిరెడ్డి జమీల్ తదితరులు జగన్ వెంట ఉతన్నారు.
 
 బాబులాంటి దగా నేతను జీవితంలో చూడలేదు
 
 నెల్లిపూడి సభలో జగన్ ధ్వజం
  సాక్షి ప్రతినిధి, రంపచోడవరం : ప్రజల్ని దగా చేసి గద్దెనెక్కిన చంద్రబాబులాంటి నాయకుడిని జీవితంలో ఎప్పుడూ చూడలేదని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహనరెడ్డి ధ్వజమెత్తారు. మోసం చేసి, వెన్నుపోట్లు పొడిచే వారిని దేవుడుపై నుంచి చూస్తూనే ఉన్నాడని, ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు.  ఏజెన్సీలో గంగవరం మండలం నెల్లిపూడిలో వైఎస్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం  జగన్ శుక్రవారం రాత్రి 12 గంటలకుగిరిజనులనుద్దేశించి మాట్లాడారు. పట్టపగలు దొంగతనం చేసి పట్టుబడ్డా వీడియో ఎందుకు తీశారని ప్రశ్నించడం చంద్రబాబు నైజానికి అద్ధం పడుతుందన్నారు.

  అధికారంలోకి రాక ముందు అందరికీ ఇళ్లు కట్టిస్తానని నమ్మించిన బాబు అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు చెల్లించకుండా నానా ఇబ్బందుల పాలు చేస్తున్నారని విమర్శించారు. విభజన అనంతరం ఖమ్మం నుంచి ఉభయగోదావరి జిల్లాల్లో విలీనమైన మండలాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. గిరిజనుల అవసరాలను తీర్చలేక సర్కారు చేతులెత్తేసిందన్నారు. రంపచోడవరంలో తమ పార్టీని ఆదరించిన వారిపై అక్రమ కేసులు పెడుతూ అష్టకష్టాల పాలన చేస్తున్నారన్నారు. ఈ కష్టాలు ఎంతోకాలం ఉండవని, రెండేళ్లలో ఈ ప్రభుత్వం పడిపోతుందని వ్యాఖ్యానించారు.

ఇక్కడి గిరిజనులు ప్రమాదంలో మృతిచెందితే అధికారులు,  అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కనీసం పలకరించిన పాపానపోలేదని, జగన్ వస్తున్నాడని తెలిసి హడావిడిగా దొంగచాటున రూ.2లక్షల చెక్కులు ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేని చంద్రబాబు సెక్యూరిటీ లేకుండా బయట తిరిగితే యువకులు రాళ్లతో కొట్టే పరిస్థితి నెలకొందన్నారు. ఇక్కడ వంతల రాజేశ్వరిని ఎమ్మెల్యేను చేసిన అనంత ఉదయభాస్కర్‌ను పోలీసులు రాజకీయ కుతంత్రాలతో కుట్రలు పన్ని కేసులు పెడుతున్నారని, అదే అనంతబాబుకు పోలీసులతోనే శాల్యూట్ కొట్టించే రోజులు తీసుకువస్తానని అన్నారు.
Share this article :

0 comments: