గుంటూరు (పొన్నూరు) : గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మన్నవ గ్రామ శివార్లలో వైఎస్సార్సీపీ సర్పంచ్ తమ్ముడిపై టీడీపీ నాయకులు దాడికి దిగారు. ఈ ఘటనలో సర్పంచ్ తమ్ముడు అమరేంద్రప్రసాద్కు తీవ్రగాయాలయ్యాయి. గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు బండ్లమూడి అశోక్, బండ్లమూడి బాబూరావు, బండ్లమూడి చింప్రయ్య, గొల్ల శ్యామ్యూల్, గన్నవరపు అనిల్, అన్నవరపు వీరయ్యలు అమరేంద్రప్రసాద్పై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
ఏయే గ్రామాల్లో వైఎస్సార్సీపీ సర్పంచ్ పదవి గెలిచిందో.. ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర టీడీపీ కార్యకర్తలను ఉసిగొల్పి ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన అమరేంద్రను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

0 comments:
Post a Comment