అడ్డగోలు నిర్ణయాలు ఇంకెంత కాలం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అడ్డగోలు నిర్ణయాలు ఇంకెంత కాలం

అడ్డగోలు నిర్ణయాలు ఇంకెంత కాలం

Written By news on Saturday, July 25, 2015 | 7/25/2015


అడ్డగోలు నిర్ణయాలు ఇంకెంత కాలం: వైఎస్సార్‌సీపీ
సాక్షి, హైదరాబాద్: మన తెలంగాణ... మన పాలన... అన్నీ అందరి నిర్ణయాలతో సమష్ఠిగా కలసి బంగారు పాలన చేసుకుందామని ఉద్యమ సమయంలోనూ, ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన సీఎం కేసీఆర్ వాస్తవంగా, క్షేత్రస్థాయిలో చేస్తున్నదేమిటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ ప్రశ్నించింది. హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి.. సీఎం కేసీఆర్ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

హుజూరాబాద్‌లో ఉపాధ్యాయురాలి దండనకు తొమ్మిదేళ్ల ఆశ్రీత బలికావటం తమ పార్టీని కలచి వేసిందన్నారు. ప్రభుత్వం ఈ అంశంపై విచారణ చేపట్టాలని కోరారు. విద్యా శాఖను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆ దిశగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఆలోచించాలని హితవు పలికారు. ఉస్మానియా ఆస్పత్రి శిథిలావస్థకు చేరిన మాట నిజమేనని తమ పార్టీ అంగీకరిస్తుందని తెలిపారు. వారంలోనే ఖాళీ చేయిస్తామని సీఎం అత్యవసరంగా ప్రకటించడం ఎంటని ప్రశ్నించారు.

అది ఆచరణ సాధ్యమా... ప్రకటించిన కేసీఆర్‌కే తెలియాలని చెప్పారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లపై సీఎం కమిటీ వేసినా ఇంత వరకు ఒక్కసారన్నా అది సమావేశం కాలేదన్నారు. 13 నెలల్లో సీఎం రకరకాల నిర్ణయాలు తీసుకున్నారని... 18 సార్లు హైకోర్టు మొట్టికాయలు వేసిందని తెలిపారు. ఇలాంటి దుందుడుకు నిర్ణయాల సీఎంను తాను ఎన్నడూ చూడలేదని కొండా పేర్కొన్నారు. ఒకే రోజు కేబినెట్ సమావేశంలో 43 నిర్ణయాలపై కేసీఆర్ సర్కారు వైఖరి ప్రకటించిందన్నారు. దాన్ని ఒక రికార్డుగా ఆయన మంత్రి వర్గసభ్యులు ప్రచారం చేసుకున్నా.. వాటిపై ఇప్పటికీ స్పష్టత లేదన్నారు. తక్షణమే 43 నిర్ణయాలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
Share this article :

0 comments: