చంద్రబాబు భయపడుతున్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు భయపడుతున్నారు

చంద్రబాబు భయపడుతున్నారు

Written By news on Friday, July 31, 2015 | 7/31/2015

అనంతపురం : హంద్రీ - నీవా ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై ఉరవకొండ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నేత వై. విశ్వేశ్వరరెడ్డి నిప్పులు చెరిగారు. శుక్రవారం అనంతపురంలో వై.విశ్వేశ్వరరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... హంద్రీ - నీవా ప్రాజెక్ట్ పూర్తయితే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి పేరు వస్తుందని చంద్రబాబు భయపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ ప్రాజెక్టును తాగునీటి ప్రాజెక్టుగా మార్చేందుకు బాబు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు.
అనంత ఆయుకట్టును నీరివ్వకుండా ఇతర ప్రాంతాలకు తరలించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని విమర్శించారు. చంద్రబాబు కుట్రలను ఎట్టి పరిస్థితిలో సహించమన్నారు. అవసరమైతే కాల్వలను పగులకొట్టి ఆయకట్టుకు నీరందిస్తామన్నారు. ఈ అంశంపై ఆగస్టు 3న ఉరవకొండలో అన్ని రాజకీయా పార్టీల కీలక నేతలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు వై విశ్వేశ్వరరెడ్డి చెప్పారు.
Share this article :

0 comments: