సీఎం.. సెటిల్‌మెంట్లా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీఎం.. సెటిల్‌మెంట్లా?

సీఎం.. సెటిల్‌మెంట్లా?

Written By news on Sunday, July 12, 2015 | 7/12/2015

వైఎస్సార్ సీపీ నేత రోజా మండిపాటు
ఎమ్మార్వో వనజాక్షిని చంద్రబాబు బెదిరించారు
విదేశాల నుంచి ట్యాపింగ్ పరికరాలు ఎందుకు?

 
హైదరాబాద్: మహిళల పట్ల వెధవ వేషాలు వేస్తే 3 నిమిషాల్లో వారి తాట తీస్తానని ఎన్నికల ప్రచారంలో హెచ్చరించిన సీఎం చంద్రబాబు ఎమ్మార్వో వనజాక్షిపై దాడికి కారకులైన టీడీపీ విప్ చింతమనేని ప్రభాకర్‌పై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేలు, నేతల దాష్టీకానికి గురైన అధికారుల్లో వనజాక్షి, నారాయణమ్మ ధైర్యంగా పోరాడుతుంటే భయపెడతారా? అని ప్రశ్నించారు. రెవెన్యూ, ఇతర శాఖల్లో చాలా మంది అధికారులు తమపై టీడీపీ నేతలు సాగిస్తున్న దురాగతాలను బయటికి చెప్పుకోలేక కుమిలి పోతున్నారన్నారు. తెలంగాణలో ‘ఓటుకు కోటు’్ల వ్యవహారంలో అడ్డంగా దొరికి పోయిన చంద్రబాబు ఆ నిందను ఇంటెలిజెన్స్ డీజీ అనూరాధపై నెట్టి బదిలీ చేయడం ఎంత వరకు సబబు అని నిలదీశారు. ఇలాంటి పనులు చేస్తున్నందుకు చంద్రబాబు పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రోజా శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్నికల సమయంలో టీవీ చానళ్లలో చంద్రబాబు గుప్పించిన ప్రకటనలను విలేకరులకు చూపించారు.

 అడ్డంగా దొరికినందుకేనా?
 మూడు రోజుల తరువాత జపాన్ నుంచి తిరిగి వచ్చిన చంద్రబాబు ఎమ్మార్వో వనజాక్షిని బెదిరించి సెటిల్‌మెంట్ చేశారని మండిపడ్డారు. పోలీసులు, దొంగలను ఇంట్లో కూర్చోబెట్టుకుని సెటిల్‌మెంట్ చేశారంటే చంద్రబాబు అసలు సీఎం పదవిలో ఉండటానికి అర్హుడేనా? అని ప్రశ్నించారు. సీఎం అంటే ఇన్నాళ్లూ చీఫ్ మినిస్టర్ అనుకున్నామని కానీ సీఎం అంటే సెటిల్‌మెంట్ మినిస్టర్ అని ఇవాళే తెలిసిందని ఎద్దేవా చేశారు. దాడికి సంబంధించి వీడియోలతోపాటు ఫొటో సాక్ష్యాధారాలున్నా చర్యలకు ఆదేశించకుండా సెటిల్‌మెంటు చేయడమేమిటని అన్నారు. చింతమనేనిని అరెస్టు చేయాలన్న డిమాండ్‌పై చంద్రబాబు ఎలాంటి హామీ ఇచ్చారని ఓ మీడియా ప్రతినిధి వనజాక్షిని ప్రశ్నిస్తే ఆమె మౌనంగా కారెక్కి వెళ్లి పోవడం చూస్తుంటే సీఎం ఎంతగా బెదిరించారో అర్థం అవుతోందన్నారు.  ఫోన్లు ట్యాపింగ్ చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని విదేశాల నుంచి బాబు ఎందుకు తెచ్చుకుంటున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: