కొవ్వూరులో వైఎస్ జగన్ పుష్కరస్నానం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కొవ్వూరులో వైఎస్ జగన్ పుష్కరస్నానం

కొవ్వూరులో వైఎస్ జగన్ పుష్కరస్నానం

Written By news on Wednesday, July 15, 2015 | 7/15/2015


కొవ్వూరులో వైఎస్ జగన్ పుష్కరస్నానం
ఆల్కాట్‌తోట (రాజమండ్రి) : వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో వీఐపీ ఘాట్‌లో పుష్కరస్నానం ఆచరించారు. పుష్కర స్నానం ఆచరించడానికి ఆయన బుధవారం ఉదయం రాజమండ్రి నుంచి బయలుదేరి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు చేరుకుని, అక్కడి గోష్పాదక్షేత్రానికి విచ్చేశారు. గోష్పాదక్షేత్రంలో గోదావరి మాతకు ఆయన పూజలు చేశారు.
వైఎస్ జగన్ తిరిగి రాజమండ్రి చేరుకుని అయ్యప్పస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత ఉమామార్కేండేయేశ్వరస్వామివారి ఆలయంలో స్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న పుష్కర సేవా కార్యక్రమాలను ఆయన పరిశీలిస్తారు. మధ్యాహ్నం కోటిలింగాల ఘాట్‌ను సందర్శించి పూజ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం మధురపూడి విమానాశ్రయం నుంచి హైదరాబాద్ బయల్దేరతారు.
వేద పండితులు,పురోహితులు దగ్గర ఉండి సంప్రదాయ బద్దంగా జగన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. జగన్ పట్టు లుంగి దరించి వచ్చి గోదావరిలో పండితుల సూచనల మేరకు ఆచారాలను పాటిస్తూ స్నానం చేశారు.జగన్ తన తండ్రి రాజశేఖరరెడ్డికి పిండప్రదానం చేశారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు అక్కడ ఉన్నారు. కాగా వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న భాస్కర శర్మ భద్రాచలం సమీపంలో వైఎస్ పేరుతో తర్పణం గావించి పిండ ప్రదానం చేసి తన గౌరవాన్ని చాటుకున్నారు.Share this article :

0 comments: