రాజధాని మాస్టర్ ప్లాన్ వెనుక బాబు కుట్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజధాని మాస్టర్ ప్లాన్ వెనుక బాబు కుట్ర

రాజధాని మాస్టర్ ప్లాన్ వెనుక బాబు కుట్ర

Written By news on Monday, July 20, 2015 | 7/20/2015

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని మాస్టర్ ప్లాన్ వెనక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్ కుట్ర దాగుందని  మంగళగిరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) విమర్శించారు. సోమవారం ఆయన హైదరాబాద్ లోని  పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు రైతులు, రైతు కూలీల పేరుతో దోచుకోవడానికే ఈ మాస్టర్ ప్లాన్' అంటూ ఆర్కే ధ్వజమెత్తారు. పేద రైతుల పొట్టగొట్టి ఏపీ రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు నిలువు దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజధాని నిర్మాణంలో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా వైఎస్సార్ సీపీ పోరాడుతుందని  ఎమ్మెల్యే ఆర్కే హెచ్చరించారు.
Share this article :

0 comments: