వైఎస్సార్ సీపీలోకి పలువురు టీఆర్ఎస్ నేతల చేరిక - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ సీపీలోకి పలువురు టీఆర్ఎస్ నేతల చేరిక

వైఎస్సార్ సీపీలోకి పలువురు టీఆర్ఎస్ నేతల చేరిక

Written By news on Saturday, July 11, 2015 | 7/11/2015

నిజామాబాద్: తెలంగాణలో వైఎస్సార్ సీపీ చేపట్టిన ప్రజాహిత ఆందోళనలకు ఆకర్షితులై ఎంతోమంది పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని వైఎస్సార్ సీపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సిద్దార్థరెడ్డి అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పార్టీ ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, యూత్ కాంగ్రెస్, నాయీ బ్రాహ్మణ సంఘాలకు చెందిన పలువురు నాయకులు వైఎస్సార్ సీపీలో చేరారు.

చేరికల సందర్భంగా సిద్దార్థరెడ్డి మాట్లాడుతూ మహానేత వైఎస్ఆర్ ఆశయాల సాధనకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారన్నారు. వారి అడుగుజాడల్లో నడిచేందుకే పలువురు పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. త్వరలోనే పార్టీ జిల్లా కమిటీలు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.
Share this article :

0 comments: