తప్పించుకునేందుకే న్యాయవిచారణ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తప్పించుకునేందుకే న్యాయవిచారణ

తప్పించుకునేందుకే న్యాయవిచారణ

Written By news on Thursday, July 16, 2015 | 7/16/2015


* పుష్కర మరణాలకు ఏపీ ముఖ్యమంత్రే కారణం
* కానీ చివరకు వేరే అధికారులను సస్పెండ్ చేస్తారు
* ఇదే తప్పు వేరేవా
రు చేసుంటే జైలుకు పంపేవారు కాదా?
* చంద్రబాబుపై ధ్వజమెత్తిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
* కొవ్వూరులో సంప్రదాయబద్ధంగా పుష్కరస్నానం
* దివంగత వైఎస్సార్, రాజారెడ్డిలతోపాటు పుష్కర మృతులకు కూడా పిండప్రదానం
* రాజమండ్రి అయ్యప్ప ఆలయంలో పూజలు

 (పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు వీఐపీ ఘాట్ లో పుష్కర స్నానం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత,  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి)

సాక్షి, కొవ్వూరు/ రాజమండ్రి: రాజమండ్రి పుష్కర ఘాట్‌లో తొక్కిసలాట జరిగి 27 మంది అమాయక భక్తులు చనిపోవడానికి కారణమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న్యాయవిచారణ పేరుతో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ ఘటనకు బాధ్యతనుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించడం నీతిమాలిన చర్యని మండిపడ్డారు. న్యాయవిచారణ నెపంతో వేరే అధికారులను బాధ్యులను చేసి సస్పెండ్ చేస్తారని చెప్పారు.

 జగన్ మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో పుష్కర పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... రాజమండ్రిలో జరిగిన విషాద ఘటన మళ్లీ మరెక్కడా జరగకూడదన్నారు. దీనిపై తానొక్కడినే మాట్లాడితే చాలదనీ, మీడియా కూడా స్పందించాలని కోరారు. తప్పుచేసిన వారిని నిలదీయాలని సూచించారు. ‘‘ప్రత్యక్షంగా, పరోక్షంగా రాజమండ్రిలో జరిగిన పుష్కర మరణాలకు చంద్రబాబు నాయుడే కారణం. సామాన్య భక్తులకు, ఇతరులకు అంతరాయం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబే వీఐపీ ఘాట్‌లు ఏర్పాటు చేయించారు.  కానీ అదే చంద్రబాబు నాయుడు వీఐపీ ఘాట్‌లో కాకుండా లక్షలమంది ప్రజలున్న ఘాట్‌కు వెళ్లి రెండున్నర గంటలపాటు స్నానం, పూజలు ఆచరించారు.

పుష్కరాలకు వచ్చిన సామాన్యులను తన పబ్లిసిటీ కోసం తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. సీఎంగా ఉన్న చంద్రబాబు ఆదేశాలతోనే అధికారులు ఒక్కసారిగా గేట్లు తీశారు. దీంతో గంటలపాటు నిరీక్షించిన ప్రజలు ఒక్కసారిగా లక్షల సంఖ్యలో రావడంతో ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాటలో మృత్యువాత పడ్డారు. 27మంది మరణానికి కారణమైన వ్యక్తి ముఖ్యమంత్రి కావడంవల్లే అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆయన స్థానంలో వేరే వారుంటే ఇదే చంద్రబాబు నాయుడు వారిని జైలుకు పంపించే వారు కాదా?’’ అని జగన్ ధ్వజమెత్తారు. కానీ ఇప్పుడు తనని తాను రక్షించుకోవడానికి సీఎం న్యాయవిచారణకు ఆదేశించారని ఆక్షేపించారు. చివరకు ఎవరో అధికారులను సస్పెండ్ చేస్తారని ఆయన చెప్పారు. జగన్ పర్యటనలో పార్టీ శాసన సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, వరుపుల సుబ్బారావు, ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మేకా శేషుబాబు, ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, పెండెం దొరబాబు, పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్, పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు, సమన్వయకర్తలు తానేటి వనిత (కొవ్వూరు), ఘంటా మురళీరామకృష్ణ (చింతలపూడి), తలారి వెంకట్రావు (గోపాలపురం), రాజీవ్‌కృష్ణ (నిడదవోలు), కారుమూరి నాగేశ్వరరావు (దెందులూరు) తదితరులు పాల్గొన్నారు.
 
 పుష్కరస్నానం.. అయ్యప్ప ఆలయంలో పూజలు
 వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజమండ్రి నుంచి రోడ్డుమార్గాన బుధవారం ఉదయం 9.45 గంటలకు కొవ్వూరు చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ నివాసంలో కొద్దిసేపు ఉండి, సంప్రదాయ పద్ధతిలో పంచె, ధోవతి ధరించి కాలినడకన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఘాట్ (వీఐపీ ఘాట్)కు వెళ్లారు. గోదావరి మాతకు సంకల్ప పూజ నిర్వహించి, నదీ స్నానమాచరించారు. ఆ తరువాత తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, తాత, నాయనమ్మలు రాజారెడ్డి, జయమ్మలకు, తాత, అమ్మమ్మలకు, ఇతర దివంగతులకు శాస్త్రోక్తంగా పిండ ప్రదాన కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే రాజమండ్రి పుష్కరఘాట్ దుర్ఘటనలో మృతిచెందిన వారికీ పిండ ప్రదానం చేశారు.
 
 ఇతర భక్తులకు ఇబ్బంది కలగకుండా ఘాట్‌లోని మెట్లపై ఒక పక్కగా కూర్చుని మండుతున్న ఎండలోనే గంటసేపు ఈ కార్యక్రమాన్ని జరిపారు. అనంతరం దశదానాలు చేశారు. వేద పండితుల ఆశీర్వచనంతో క్రతువు ముగించారు. ఆ తర్వాత అక్కడినుంచి బయలుదేరి కొవ్వూరులో పశ్చిమగోదావరి జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన భారీ అన్నప్రసాద శిబిరాన్ని సందర్శించారు. తాను లోనికి వస్తే భక్తులకు అసౌకర్యం కలుగుతుందని నిర్వాహకులను బయటే అభినందించారు. అక్కడినుంచి రాజమండ్రికి చేరుకున్న జగన్ సరస్వతీ (వీఐపీ) ఘాట్ పక్కనే ఉన్న శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రానికి (అయ్యప్పస్వామి ఆలయం) చేరుకున్నారు. వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయం లోపలకి తీసుకెళ్లారు. జగన్ అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. అనంతరం నేరుగా మధురపూడి విమానాశ్రయానికి చేరుకుని విమానంలో హైదరాబాద్ పయనమయ్యారు.
Share this article :

0 comments: